జుకర్‌బర్గ్‌ కొంపముంచిన ఫేస్‌బుక్‌ యూజర్లు..! తను మునిగిపోయి.. అదానీ, అంబానీల నెత్తిన పాలు పోశాడు

Meta Crash Makes Mukesh Ambani Gautam Adani Wealthier Than Mark Zuckerberg - Sakshi

ఫేస్‌బుక్‌ పేరెంట్‌ కంపెనీ మెటాకు యూజర్లు గట్టి షాక్‌ను ఇచ్చారు. ఫేస్‌బుక్‌ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా యూజర్ల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఇదే మెటా అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌ కొంపముంచింది. దీంతో ఒక్కరోజులోనే జుకర్‌బర్గ్‌ నికర విలువ 29 బిలియన్‌ డాలర్లను  కోల్పోయాడు. 

జుకర్‌బర్గ్‌ స్థానం గల్లంతు..!
ఫేస్‌బుక్‌ పేరెంట్‌ కంపెనీ Meta Platforms Inc క్యూ 3లో నిరుత్సాహకరమైన ఆదాయాలను నమోదుచేయడంతో గురువారం(ఫిబ్రవరి 3) రోజున మెటా షేర్లు ఒక్కసారిగా పడిపోయాయి. మార్కెట్‌ చరిత్రలో మెటా మార్కెట్‌ క్యాప్‌ రికార్డు స్థాయిలో  26 శాతం నష్టాలను మూటకట్టుకుంది. దీంతో మెటా ఒక్కరోజే 251 బిలియన్‌ డాలర్లను కోల్పోయింది. మెటా షేర్లు భారీగా పతనమవ్వడంతో జుకమ్‌బర్గ్‌ నికర ఆస్తుల విలువ కూడా భారీగా తగ్గిపోయింది. ఫిబ్రవరి 3న మెటా స్టాక్ 26 శాతం నష్టపోవడంతో జుకర్‌బర్గ్ నికర విలువలో 29 బిలియన్‌ డాలర్లను కోల్పోయారు. ఫోర్బ్స్ ప్రకారం.. మెటా వ్యవస్థాపకుడు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జుకర్‌బర్గ్ నికర విలువ 85  బిలియన్ల డాలర్లక పడిపోయింది .

అదానీ, అంబానీకి కలిసొచ్చింది..!
మెటా షేర్ల వైప్‌ అవుట్‌ మన ఇండియన్‌ బిలియనీర్స్‌ అదానీ, అంబానీలకు కలిసొచ్చింది. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ జాబితా ప్రకారం, అదానీ నికర విలువ 90.1 బిలియన్‌ డాలర్లు ఉండగా, అంబానీ నికర ఆస్తుల సంపద 90 బిలియన్‌ డాలర్లుగా ఉంది. మెటా షేర్ల భారీ వైపౌట్ తర్వాత జుకర్‌బర్గ్ పన్నెండవ స్థానానికి పడిపోయాడు. నవంబర్‌లో టెస్లా అధినేత ఎలన్ మస్క్ సింగిల్‌ డేలో 35 బిలియన్ డాలర్లను కోల్పోయిన తరువాత ఈ రేంజ్‌లో నికర ఆస్తుల విలువను పొగోట్టుకున్న వ్యక్తి జుకర్‌బర్గ్‌ రికార్డు సృష్టించాడు.

టెక్నాలజీ స్టాక్స్‌లో అస్థిరత..!
టిక్‌టాక్‌, యూట్యూబ్‌ వంటి ప్రత్యర్థుల నుంచి ఫేస్‌బుక్‌ భారీ పోటీ నెలకొంది. దాంతో పాటుగా ప్రైవసీ మార్పులపై తీసుకున్న యాపిల్‌ నిర్ణయాలు మెటా షేర్లు పడిపోయే కారణాలుగా ఉన్నాయి. ఇకపోతే అధిక ద్రవ్యోల్బణం,  వడ్డీ రేట్లలో ఊహించిన పెరుగుదల ప్రభావంతో అమెరికన్‌ మార్కెట్లో టెక్నాలజీ స్టాక్స్‌లో అస్థిరత నెలకొంది.

చదవండి: చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు..! యూజర్ల దెబ్బకు ఒక్క రోజులోనే లక్షన్నర కోట్లు లాస్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top