సోషల్ మీడియాకు కేంద్రం వార్నింగ్

Ravi Shankar Prasad: Strict Action Will Be Taken Against Social Media Platforms - Sakshi

న్యూఢిల్లీ: ట‌్విట‌ర్‌తో నెల‌కొన్న ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం నేప‌థ్యంలో సోష‌ల్ మీడియాతో పాటు యూజ‌ర్ల‌కు గట్టి వార్నింగ్ ఇచ్చింది కేంద్ర ప్ర‌భుత్వం. ఇక నుంచి సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు వ్యాపింపజేసిన, హింసను ప్రేరేపించిన కఠిన చర్యలు తప్పవని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ రాజ్య‌స‌భ‌లో ప్ర‌క‌టించారు. రాజ్యసభలో ట‌్విట‌ర్, ఫేస్‌బుక్, వాట్సాప్, యూట్యూబ్, లింక్డ్‌ఇన్‌ల పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించిన కేంద్ర మంత్రి.."మీకు భారతదేశంలో మిలియన్ల మంది అభిమానులు ఉన్నారు. మీరు వ్యాపారం చేసుకోవడానికి, డబ్బు సంపాదించుకోవడానికి స్వేచ్ఛ ఉంది. కానీ మీరు తప్పనిసరిగా భారత రాజ్యాంగాన్ని అనుసరించాల్సి ఉంటుంది" అని అన్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల దుర్వినియోగంపై క్వశ్చన్ అవర్ సందర్భంగా మాట్లాడుతూ ఆయ‌న ఈ హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. 

"మేము సోషల్ మీడియాను చాలా గౌరవిస్తాము, ఇది సామాన్య ప్రజలను శక్తివంతం చేస్తుంది. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో సోషల్ మీడియాకు పెద్ద పాత్ర ఉంది. అయితే, నకిలీ వార్తలు, హింసను వ్యాప్తి చేయడానికి సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తే చర్యలు తప్పవు" అని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఖలిస్తాన్‌, పాకిస్తాన్‌ లింకులున్న మొత్తం 1,178 ఖాతాలను బ్యాన్‌ చేయాలన్న హెచ్చరికల నేపథ్యంలో పలు ఖాతాలను ఇప్పటికే తొలగించిన ట‌్విట‌ర్, కొద్దీ రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేసింది. భారత ప్రభుత్వ ఆదేశాలు చట్ట విరుద్ధమని, భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతమంటూ ఒక బ్లాగ్ పోస్ట్ లో వివరణ ఇచ్చింది. అయితే దీనిపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది.

చదవండి:

పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్!

ఆధార్ యూజర్లకు ముఖ్య గమనిక

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top