Raunaq and Rhea Couple Built a Rs 38 Crore Business During the Pandemic - Sakshi
Sakshi News home page

స్వీట్‌ కపుల్‌ సక్సెస్‌ స్టోరీ: తొలి ఏడాదిలోనే రూ.38 కోట్లు

Published Sat, May 13 2023 8:01 PM

Raunaq and Rhea Success story couple built a Rs 38 crore business during the pandemic - Sakshi

కరోనా మహమ్మారి చాలామంది జీవితాల్లో తీరని దుఃఖాన్ని, సంక్షోభాన్ని మిగిల్చింది. కానీ కొంతమందిలో మాత్రం వినూత్న ఆలోచనలకు పునాది వేసింది. అలా లాక్‌డౌన్‌లో లాక్‌ అయిన ఒక కొత్త జంట సరికొత్త ఆలోనచలతో వ్యాపారాన్ని ప్రారంభించారు. అతికొద్ది సమయంలోనే కోట్ల ఆదాయాన్ని ఆర్జించారు. ఇదే రియా అండ్‌ రౌనక్‌ సక్సెస్‌  స్టోరీ.


రియా నిహాల్ సింగ్, రౌనక్ సింగ్ ఆనంద్‌ వివాహ బంధంలోకి అలా అడుగు పెట్టారో లేదో 2020లో దేశం కరోనా కారణంగా దేశవ్యాప్త లాక్‌డౌన్‌ మొదలైంది. దీంతో కొత్త జంట ఇంటికే పరిమితం కావడంతో వ్యాపారాన్ని  ప్రారంభించాలనుకున్న వారి ఆశయానికి బ్రేక్‌ పడింది.   

కానీ బిజినెస్‌ చేయాలన్న ఆలోచన వారిని ఊరికే ఉండనీయ లేదు.  ఫిట్‌నెస్ ఔత్సాహికులైన ఇద్దరూ హోమ్ జిమ్‌ని స్టార్ట్‌ చేద్దామని డిసైడ్‌ అయ్యారు. కానీ తాము కాలేజీ రోజుల్లో అమెరికాలో  ఉపయోగించిన స్మార్ట్ ఫిట్‌నెస్ పరికరాలు మార్కెట్లో అందుబాటులో లేవు. మరోవైపు పెద్దగా నాణ్యతలేని ఉత్పత్తులను కొనుగోలు చేయడమా, లేదంటే లక్షల రూపాయలు వెచ్చించి దిగుమతి చేసుకోవడమా అనే రెండు ఆప్షన్లు మాత్రమే కనిపించడంతో మీమాంసలో పడి పోయారు. ఈ క్రమంలో మార్కెట్లో తమలాంటి చాలామంది ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారని  గ్రహించారు.

అప్పటికే తండ్రి ఆటో కాంపోనెంట్స్ తయారీ సంస్థకు బిజినెస్ డెవలప్‌మెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న రౌనక్, మార్కెట్ డిమాండ్‌నుచూసి, తన సొంతహోమ్ ఫిట్‌నెస్ పరికరాల కంపెనీని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. అలా  భార‍్యతో కలిసి  డైరెక్ట్-టు-కస్టమర్ బ్రాండ్ ఫ్లెక్స్‌నెస్ట్‌ ని ప్రారంభించారు. ఈ కంపెనీ ద్వారా ఇంటర్నెట్‌లో నాణ్యమైన ఫిట్‌నెస్ పరికరాలను విక్రయిస్తూ పాపులర్‌ అవ్వడమే కాదు. కేవలం మూడేళ్లలో ఒక  బ్రాండ్‌ నేమ్‌ను  తీసుకొచ్చారు.

2021లో ఫ్లెక్స్‌నెస్ట్‌ను ఆవిష్కృతమైంది. యోగా మ్యాట్‌లు,ఎడ్జస్టబుల్‌ డంబెల్‌లతో ప్రారంభమై ఆ తరువాత తొలి  బ్లూటూత్ కనెక్టెడ్‌ ఎక్సర్‌సైజ్ స్పిన్ బైక్‌, ఫ్లెక్స్‌నెస్ట్ రోవర్స్ ట్రెడ్‌మిల్స్‌ను పరిచయం చేశారు.అలా ఏడాదిన్నరలో వారి పోర్ట్‌ఫోలియోలో దాదాపు 12 ఉత్పత్తులను జోడించారు. గుర్గావ్‌లో కేవలం అయిదుగురి స్టాఫ్‌తో కార్యకలాపాలు ప్రారంభించిన తొలి ఏడాదిలోనే కంపెనీ రూ.37.5 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. (18 ఏళ్లకే లంబోర్ఘినీ కారు, 22 ఏళ్లకే రిటైర్‌మెంట్‌)

2022 జనవరిలోనే వారి ఆదాయం  రికార్డు ఆదాయం రూ.3.83 కోట్లను సాధించారు. హోమ్ వర్కౌట్‌ జిమ్‌  ఉత్పత్తులతో   టాప్‌లో నిలిచింది. ఇపుడిక రూ. 100 కోట్ల ఆదాయాన్ని ఈ జంట ఆశిస్తోంది. వీరి ఉత్పత్తుల్లో దాదాపు సగం టైర్ 1 నగరాల్లో అమ్ముడవుతున్నాయి. ప్రధానం జర్మనీ, చైనా, తైవాన్‌ల ఉత్పత్తులను విక్రయిస్తారు. ఈ సేల్స్‌లో 70 శాతం వెబ్‌సైట్,  30శాతం ఇతర ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్‌ల నుండే జరుగుతాయి. 70వేలకు పైగా కస్టమర్లను సొంతం చేసుకున్న కంపెనీ, యాప్ ద్వారా వర్చువల్ శిక్షణ తరగతులను అందిస్తారు. (జియో సినిమా షాకిచ్చిందిగా: ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ షురూ)

ఫిట్‌నెస్ బ్రాండ్   ఫ్లెక్స్‌ నెస్ట్‌  FlexDubs లాంచ్‌తో ఆడియో మార్కెట్‌లోకి  కూడా ప్రవేశించింది. జర్మనీలో తయారైన   AI- ఎనేబుల్డ్ వాయిస్ అసిస్టెన్స్‌  బ్లూటూత్ ఇయర్‌ఫోన్‌లు  లాంచ్‌ చేసింది.  

అమెరికాలో పరిచయం, ప్రేమ
రియా నిహాల్ సింగ్ ఎమోరీ యూనివర్శిటీ నుండి ఎకనామిక్స్  పట్టా,  జార్జియా విశ్వవిద్యాలయం నుంచి  థియేటర్ స్టడీస్ (2012-2016)లో బ్యాచిలర్స్ డిగ్రీ చేసింది. పాఠశాల విద్యను ఢిల్లీలోని వసంత్ వ్యాలీ స్కూల్ నుండి పూర్తి చేసింది. వ్యాపారవేత్త కావడానికి ముందు, రియా  ఎన్డీటీవీలోనూ,  పబ్లిక్ రిలేషన్స్ విభాగంలోనూ పనిచేసింది. రౌనక్‌ బర్కిలీ నుండి మెకానికల్ ఇంజనీరింగ్ , డ్యూక్ విశ్వవిద్యాలయంలో మేనేజ్‌మెంట్‌లో పీజీ చేశారు.

2015లో కాలేజీలో చదువుతున్నప్పుడు అమెరికాలో పప్రేమలో పడిన ఈ లవ్‌బర్డ్స్‌ 2020 జనవరిలో వివాహం చేసుకున్నారు. రౌనక్  తండ్రి కార్ కాంపోనెంట్ తయారీ కంపెనీ యజమాని. రియా కూడా ఢిల్లీలోని ప్రముఖ వ్యాపార కుటుంబం నుండి వచ్చింది. ఆమె తండ్రి గుర్మీత్ నిహాల్ సింగ్ బట్టల ఎగుమతిదారు. అలా ఇద్దిరిదీ వ్యాపార కుటుంబాల నేపథ్యం కావడంతో  ఈ జంటకు మరింత కలిసి వచ్చింది. 

Advertisement
 
Advertisement