
తమిళ్ సూపర్ స్టార్ 'రజనీ కాంత్' గురించి ప్రత్యేకంగా పరిచయమే అవసరం లేదు. ఎందుకంటే తన నటనతో, స్టైల్‌తో ఎంతోమంది అభిమానుల మనసుదోచుకున్న ఈయన ఏడు పదులు వయసుదాటినా.. ఎంతో ఎనర్జిటిక్‌గా సినిమాల్లో కనిపిస్తున్నారు. సినిమాల్లో నటించడమే కాకుండా ఈయన ఓ ఆటోమొబైల్ ప్రేమికుడు కూడా. ఈ కారణంగానే ఈయన గ్యారేజిలో ఖరీదైన అన్యదేశ్య కార్లు, మన దేశంలో తయారైన కార్లు కూడా ఉన్నాయి.
రజినీకాంత్ కార్లు
➤ప్రీమియర్ పద్మిని
➤హోండా సివిక్
➤బీఎండబ్ల్యూ ఎక్స్5
➤బీఎండబ్ల్యూ ఎక్స్7
➤మెర్సిడెస్ బెంజ్ జి-వ్యాగన్
➤రోల్స్ రాయిస్ ఫాంటమ్
➤రోల్స్ రాయిస్ ఘోస్ట్
➤కస్టమ్-బిల్ట్ బెంట్లీ లిమోసిన్
➤లంబోర్గిని ఉరుస్
ఇదీ చదవండి: ఏప్రిల్‌లో 4.80 లక్షల సేల్స్: ఈ బ్రాండ్ వాహనాలకే డిమాండ్!
రజనీకాంత్ (అసలు పేరు శివాజీ రావు గైక్వాడ్) ఐదు దశాబ్దాలకుపైగా సుమారు 170 సినిమాల్లో నటించారు. ఇందులో కేవలం తమిళ సినిమాలు మాత్రమే కాకుండా తెలుగు, కన్నడ, మలయాళం మొదలైన భాషల సినిమాలు ఉన్నాయి. రజనీకాంత్ మొత్తం ఆస్తి రూ. 430 కోట్ల కంటే ఎక్కువ ఉంటుందని తెలుస్తోంది.