tamil super star
-
రజనీకాంత్ కార్ల ప్రపంచం.. చూశారా?
తమిళ్ సూపర్ స్టార్ 'రజనీ కాంత్' గురించి ప్రత్యేకంగా పరిచయమే అవసరం లేదు. ఎందుకంటే తన నటనతో, స్టైల్‌తో ఎంతోమంది అభిమానుల మనసుదోచుకున్న ఈయన ఏడు పదులు వయసుదాటినా.. ఎంతో ఎనర్జిటిక్‌గా సినిమాల్లో కనిపిస్తున్నారు. సినిమాల్లో నటించడమే కాకుండా ఈయన ఓ ఆటోమొబైల్ ప్రేమికుడు కూడా. ఈ కారణంగానే ఈయన గ్యారేజిలో ఖరీదైన అన్యదేశ్య కార్లు, మన దేశంలో తయారైన కార్లు కూడా ఉన్నాయి.రజినీకాంత్ కార్లు➤ప్రీమియర్ పద్మిని➤హోండా సివిక్➤బీఎండబ్ల్యూ ఎక్స్5➤బీఎండబ్ల్యూ ఎక్స్7➤మెర్సిడెస్ బెంజ్ జి-వ్యాగన్➤రోల్స్ రాయిస్ ఫాంటమ్➤రోల్స్ రాయిస్ ఘోస్ట్➤కస్టమ్-బిల్ట్ బెంట్లీ లిమోసిన్➤లంబోర్గిని ఉరుస్ఇదీ చదవండి: ఏప్రిల్‌లో 4.80 లక్షల సేల్స్: ఈ బ్రాండ్ వాహనాలకే డిమాండ్!రజనీకాంత్ (అసలు పేరు శివాజీ రావు గైక్వాడ్) ఐదు దశాబ్దాలకుపైగా సుమారు 170 సినిమాల్లో నటించారు. ఇందులో కేవలం తమిళ సినిమాలు మాత్రమే కాకుండా తెలుగు, కన్నడ, మలయాళం మొదలైన భాషల సినిమాలు ఉన్నాయి. రజనీకాంత్ మొత్తం ఆస్తి రూ. 430 కోట్ల కంటే ఎక్కువ ఉంటుందని తెలుస్తోంది. -
HBD Ajith : బైక్ మెకానిక్ నుంచి సూపర్ స్టార్‌గా..
సింప్లిసిటీకి చిరునామా ఆయన. ప్రతిఏటా ఫోర్బ్స్ ప్రకటించే అత్యంత సంపన్నుల జాబితాలో మూడుసార్లు నిలిచారు. అయినా సింపుల్‌గా ఆటోలోనూ ప్రయాణిస్తారు. స్టార్ హీరో స్టేటస్ ఉంది అయినా అందరితో ఆప్యాయంగా మాట్లాడతారు. జుట్టు రంగు నెరిసినా కలర్ వేసి కవర్ చేయాలనుకోరు. ఎంత ఎదిగినా ఒదిగే ఉంటారు. అందుకే తమిళ నాట అభిమానుల గుండెల్లో చోటు సంపాదించుకున్నారు. ఆయనే తమిళ సూపర్ స్టార్ అజిత్. తెలంగాణలో పుట్టిన అజిత్ బైక్ మెకానిక్ నుంచి తమిళనాట స్టార్‌గా ఎలా ఎదిగారు? అజిత్ 50వ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినీ ప్రయాణంపై స్పెషల్ స్టోరీ అజిత్ 1971 మే 1న హైదరాబాద్‌లోని సికింద్రాబాద్‌లో జన్మించారు. ఆయన తండ్రి సుబ్రహ్మమణియన్ది కేరళ కాగా, తల్లి మోహిని కోల్‌కతాకు చెందిన వారు. పదవ తరగతిలోనే చదువు మానేసిన అజిత్ ఓ మిత్రుడి ద్వారా కొంతకాలం ఓ ప్రముఖ కంపెనీలో అప్రెంటీస్ మెకానిక్‌గా పని చేశారు. ఆ తర్వాత వస్త్ర వ్యాపారంలోకి దిగిన అజిత్..అక్కడే ఇంగ్లిష్‌లో మాట్లాడే నైపుణ్యం సంపాదించారు. ఆ తర్వాత మోడలింగ్ చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీ.సీ.శ్రీరామ్ అజిత్‌లోని నటుడ్ని గుర్తించారు. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చిన అజిత్ ‘ఎన్ వీడు ఎన్ కనవర్’ అనే సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించారు. అదే సంవత్సరంలో ‘ప్రేమ పుస్తకం’ అనే తెలుగు చిత్రంలో నటించారు. అజిత్ నటించిన ఏకైక తెలుగు సినిమా ఇదే. కెరీర్ తొలినాళ్లలో అజిత్ ఎన్నో ప్రేమకథా చిత్రాల్లో నటించిన అజిత్.. ‘అమర్కలం’ చిత్ర షూటింగ్లో స్టార్ హీరోయిన్ షాలినీతో ప్రేమలో పడ్డారు. 2000 ఏప్రిల్ 24న పెళ్లిబంధంతో వీరిద్దరూ ఒకటయ్యారు. అప్పటి దాకా లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న అజిత్‌ను మాస్ ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లిన చిత్రం ‘ధీన’. మురుగదాస్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. అజిత్‌కు స్టార్ ఇమేజ్ను తెచ్చిపెట్టింది. ఇందులో అజిత్ పోషించిన పాత్ర 'తలా'నే అభిమానులు పిలుచుకునే ముద్దుపేరైంది. ‘ఆసాయ్’ అనే సినిమా సక్సెస్ తర్వాత ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. 1999లో అజిత్ నటించిన ఆరు సినిమాలు విడుదల కాగా.. అన్ని సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. తన సినీ కెరీర్లో ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న అజిత్‌కు కార్లపై ఉన్న ఇష్టం అంతా ఇంతా కాదు. ఆయన ఇంట్లోనే కార్ల కోసం పెద్ద గ్యారజీ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ముంబై, ఢిల్లీ, చెన్నైలలో జరిగిన కారు రేసింగుల్లో అజిత్ సత్తా చాటారు. ఇక తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం, ఇంగ్లీష్ భాషలను అనర్గళంగా మాట్లాడగలిగే అజిత్..వీలున్నప్పుడల్లా హైదరాబాద్‌ను విచ్చేస్తుంటారు. ప్రస్తుతం హెచ్.వినోథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘వలిమై’ అనే సినిమాలో అజిత్ నటిస్తున్నారు. -
ఫలితాలపై భిన్నంగా స్పందించిన కమల్, రజనీ
సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలకు ముందు సెమీఫైనల్స్‌గా పరిగణిస్తున్న అయిదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తమిళ సూపర్స్టార్లు కమల్ హాసన్, రజనీకాంత్‌లు పరస్పరం భిన్నంగా స్పందించారు. బీజేపీని వ్యతిరేకించే కమల్ హాసన్ ఎన్నికల ఫలితాలపై వ్యాఖ్యానిస్తూ ‘నూతన ఆరంభానికి ఇది తొలి సంకేతం..ఇది ప్రజల తీర్ప’ ని ట్వీట్ చేశారు. ఇక బీజేపీకి సన్నిహితంగా వ్యవహరిస్తారని భావించే రజనీకాంత్ అయిదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎదురుదెబ్బ వంటివని పేర్కొనడం గమనార్హం. రజనీ బీజేపీ వైపు మొగ్గుచూపుతారని గతంలోనూ పలుమార్లు వార్తలు వచ్చినా ఆయన వాటిని తోసిపుచ్చారు. తన వెనుక బీజేపీ ఉంటుందని చెబుతున్నారు కానీ తన వెనుక ప్రజలున్నారని, భగవంతుడున్నాడని ఆయన చెప్పుకొచ్చారు. -
రజనీ రాజకీయ ప్రవేశంపై జోరుగా ఉహాగానాలు
చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లో వస్తారా? తమిళనాట మరోసారి ఈ విషయం తెరపైకి వచ్చింది. ఎన్నికలు వచ్చినప్పుడల్లా రజనీ రాజకీయాల్లో వస్తారంటూ ప్రచారం జరుగుతోంది. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో నరేంద్ర మోదీ ఆయన ఇంటికి వెళ్లి కలిశారు. ఆ తర్వాత రజనీ బీజేపీలో చేరుతారంటూ ప్రచారం సాగింది. తాజాగా ఇదే విషయం చర్చనీయాంశమైంది. జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ స్థానం నుంచి ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేస్తున్న గంగై అమరన్.. రజనీకాంత్‌తో సమావేశమయ్యారు. అమరన్ ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు సోదరుడు. రజనీతో అమరన్ కలవడంపై తమిళనాట సర్వత్రా చర్చ జరుగుతోంది. రజనీ త్వరలో బీజేపీలో చేరుతారని ఊహాగానాలు జోరందుకున్నాయి. గతంలో కూడా ఆయన సొంతంగా పార్టీ పెడతారని ప్రచారం జరిగింది. పలువురు ప్రముఖులు స్వయంగా కలసి, మరికొందరు బహిరంగం ఆయన్ను రాజకీయాల్లోకి ఆహ్వానించారు. అయితే వస్తానని కానీ రానని కాని ఆయన ప్రకటించలేదు. బీజేపీలోకి తమిళ సూపర్ స్టార్ చేరుతారా లేదా అన్నది కూడా ప్రస్తుతానికి సస్పెన్ష్. -
కొచ్చాడియన్ ఆడియో విడుదల
-
నో పాలిటిక్స్.. రజనీకాంత్
చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై గతంలో ఎన్నో సార్లు వచ్చాయి. తాజాగా ఎన్నికలు సమీపిస్తుండటంతో మరోసారి ఈ విషయం చర్చనీయాంశమైంది. రజనీకాంత్ తాజా చిత్రం కొచ్చాడియన్ ఆడియో విడుదల కార్యక్రమంలో ఈ ప్రస్తావన వచ్చింది. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి మద్దతిస్తారా లేక ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్కా అంటూ విలేకరుల అడిగిన ప్రశ్నకు రజనీకాంత్ మరోసారి తనదైన శైలిలో సమాధానమిచ్చారు. రాజకీయాల గురించి మాట్లాడనంటూ రజనీ స్పష్టం చేశారు. గతంలో రజనీ రాజకీయ పార్టీ స్థాపించబోతున్నారని వార్తలు వచ్చినప్పుడు కూడా ఆయన పెదవి విప్పలేదు. కొచ్చాడియన్ తెలుగు, తమిళ పాటలను విడుదల చేశారు. తెలుగులో ఈ సినిమాను విక్రమసింహగా విడుదల చేస్తున్నారు. వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది. ఆడియో కార్యక్రమంలో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ పాల్గొన్నారు.