
నో పాలిటిక్స్.. రజనీకాంత్
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై గతంలో ఎన్నో సార్లు వచ్చాయి. తాజాగా ఎన్నికలు సమీపిస్తుండటంతో మరోసారి ఈ విషయం చర్చనీయాంశమైంది.
చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై గతంలో ఎన్నో సార్లు వచ్చాయి. తాజాగా ఎన్నికలు సమీపిస్తుండటంతో మరోసారి ఈ విషయం చర్చనీయాంశమైంది. రజనీకాంత్ తాజా చిత్రం కొచ్చాడియన్ ఆడియో విడుదల కార్యక్రమంలో ఈ ప్రస్తావన వచ్చింది. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి మద్దతిస్తారా లేక ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్కా అంటూ విలేకరుల అడిగిన ప్రశ్నకు రజనీకాంత్ మరోసారి తనదైన శైలిలో సమాధానమిచ్చారు. రాజకీయాల గురించి మాట్లాడనంటూ రజనీ స్పష్టం చేశారు. గతంలో రజనీ రాజకీయ పార్టీ స్థాపించబోతున్నారని వార్తలు వచ్చినప్పుడు కూడా ఆయన పెదవి విప్పలేదు.
కొచ్చాడియన్ తెలుగు, తమిళ పాటలను విడుదల చేశారు. తెలుగులో ఈ సినిమాను విక్రమసింహగా విడుదల చేస్తున్నారు. వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది. ఆడియో కార్యక్రమంలో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ పాల్గొన్నారు.