
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన సూపర్ స్టార్లు..
సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలకు ముందు సెమీఫైనల్స్‌గా పరిగణిస్తున్న అయిదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తమిళ సూపర్‌స్టార్లు కమల్ హాసన్, రజనీకాంత్‌లు పరస్పరం భిన్నంగా స్పందించారు. బీజేపీని వ్యతిరేకించే కమల్ హాసన్ ఎన్నికల ఫలితాలపై వ్యాఖ్యానిస్తూ ‘నూతన ఆరంభానికి ఇది తొలి సంకేతం..ఇది ప్రజల తీర్ప’ ని ట్వీట్ చేశారు.
ఇక బీజేపీకి సన్నిహితంగా వ్యవహరిస్తారని భావించే రజనీకాంత్ అయిదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎదురుదెబ్బ వంటివని పేర్కొనడం గమనార్హం. రజనీ బీజేపీ వైపు మొగ్గుచూపుతారని గతంలోనూ పలుమార్లు వార్తలు వచ్చినా ఆయన వాటిని తోసిపుచ్చారు. తన వెనుక బీజేపీ ఉంటుందని చెబుతున్నారు కానీ తన వెనుక ప్రజలున్నారని, భగవంతుడున్నాడని ఆయన చెప్పుకొచ్చారు.