చార్జింగ్‌ టెన్షన్‌ లేదిక.. ఎలక్ట్రిక్‌ స్కూటర్ల కంపెనీ ఒప్పందం

Quantum Energy partners with Battery Smart to enable battery swapping for e scooters - Sakshi

హైదరాబాద్‌: ఎలక్ట్రిక్‌ టూవీలర్ల కంపెనీ క్వాంటమ్‌ ఎనర్జీ తాజాగా బ్యాటరీ స్మార్ట్‌తో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. దీనితో తమ ఎలక్ట్రిక్‌ స్కూటర్ల బ్యాటరీల మార్పిడి (స్వాపింగ్‌) కోసం 25 పైచిలుకు నగరాల్లో 900 పైగా ఉన్న బ్యాటరీ స్మార్ట్‌ స్వాప్‌ స్టేషన్లు అందుబాటులోకి వస్తాయని క్వాంటమ్‌ ఈ–స్కూటర్స్‌ డైరెక్టర్‌ సి. చేతన తెలిపారు.

చార్జింగ్‌ కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా యూజర్లు రెండు నిమిషాల వ్యవధిలోనే పూర్తి స్థాయిలో చార్జ్‌ అయిన బ్యాటరీలను పొందవచ్చని వివరించారు. ఈ తరహా బ్యాటరీ–యాజ్‌–ఎ–సర్వీస్‌ విధానం వల్ల జీవితకాలం పూర్తయిన బ్యాటరీలను రీప్లేస్‌ చేసుకునే వ్యయాలు తగ్గుతాయని తెలిపారు.

బ్యాటరీ స్మార్ట్ స్వాపింగ్ స్టేషన్లు వ్యూహాత్మకంగా అధిక జన సాంద్రత, ట్రాఫిక్ ప్రాంతాలకు సమీపంలో ఉంటాయి.  దీంతో క్వాంటం ఎనర్జీ స్కూటర్లకు అందుబాటులో ఉంటాయని, తద్వారా వాహనదారులకు నిర్వహణ ఖర్చులు కూడా తగ్గుతాయని కంపెనీ చెబుతోంది.

 

whatsapp channel

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top