Tax Rules: స్థిరాస్తి క్రయవిక్రయాలు.. చెక్‌ లిస్ట్‌.. | Real Estate Buying And Selling Checklist Key Documents, Tax Rules And Precautions To Avoid Legal And Financial Risks | Sakshi
Sakshi News home page

Tax Rules: స్థిరాస్తి క్రయవిక్రయాలు.. చెక్‌ లిస్ట్‌..

Oct 12 2026 4:36 PM | Updated on Oct 12 2026 4:52 PM

Property Buying Selling Checklist Documents Tax Rules

గత ఎన్నో వారాలుగా మూలధన లాభాల గురించి తెలుసుకున్నాం. రాబోయే సంచికల్లో ట్యాక్సేషన్‌–ట్యాక్స్‌ ప్లానింగ్‌ గురించి తెలుసుకుందాం. ఈ వారం స్థిరాస్తి క్రయవిక్రయాలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలకు సంబంధించిన ‘చెక్‌లిస్ట్‌’ మీకోసం.  

(A) జనరల్‌.. 
🔹 మీతో వ్యవహారం జరిపే వ్యక్తి ఎవరు. దీన్నే ప్రస్తుత భాషలో కేవైసీ అంటారు. పాన్‌ కార్డు, ఆధార్‌ కార్డు, ఇతర ఐడెంటిటీ కార్డు, సంస్థ అయితే సంబంధిత కాగితాలు ఉండాలి. 
🔹 టైటిల్‌ హక్కులు నిజమైనవేనా? ఒరిజినల్‌ సేల్‌ డీడ్, లింక్‌ డాక్యుమెంట్లు, మదర్‌ డాక్యుమెంట్లు, ఈసీ, ప్రాపర్టీ ట్యాక్స్‌ రశీదులు, కరెంటు బిల్లులు, ఓనరు ఎవరు? జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ హోల్డరా? ఆ హక్కు అమల్లోనే ఉందా? 
🔹 ప్రాపర్టీ మీద కేసులున్నాయా? అటాచ్‌మెంట్‌ కేసులు, స్టే, ఫ్యామిలీ డిస్ప్యూట్‌లు ఉన్నాయా? లే అవుట్‌ అప్రూవ్‌ అయిందా? రెరా, హెచ్‌ఎండీఏ కాగితాలు ఉన్నాయా? 
🔹 బయ్యర్‌ స్వయంగా కొంటున్నారా, లోన్‌ ద్వారా కొంటున్నారా? లోన్‌ లెటరుందా? 
🔹 అమ్మే వ్యక్తి బ్యాంకు అకౌంటు వివరాలు 
🔹 అమ్మే వ్యక్తి రెసిడెంటా? నాన్‌–రెసిడెంటా?

(B) ఏ పరిస్థితుల్లో ముందుకెళ్లకూడదు? 
కొన్ని పరిస్థితుల్లో వ్యవహారాలు జరగడం చట్టరీత్యా నేరం. మీరు ముందుకు అడుగేయకూడదు. 
🔹 నగదు అంశం ఉంటే 
🔹 ఇతరులతో అకౌంటులో డబ్బులు వేయమని అడిగితే 
🔹 సబ్‌–రిజిస్ట్రార్స్‌ వారి విలువ కన్నా తక్కువకు అగ్రిమెంటు జరిగితే 
🔹 పాన్‌/ఆధార్‌ ఇవ్వకపోతే 
🔹 ఈసీ/ఒరిజినల్‌ డాక్యుమెంట్స్‌ ఇవ్వకపోతే 
🔹 ఈ రోజు కలిసి, రేపే రిజి్రస్టేషన్‌ అని తొందరపెడితే ప్రతి వ్యవహారం గురించి భయపడనవసరం లేదు. అయితే, మీకు పరిచయం లేకుండా.. ఏదైనా రిఫరెన్స్‌ లేకుండా వచి్చన పారీ్టల విషయంలో ఆలోచించాలి.

(C) అగ్రిమెంటుకు వెళ్లే ముందు 
🔹 అమ్మకపు విలువ, గవర్నమెంటు వారి విలువ కన్నా తక్కువ ఉండకూడదు. 
🔹 మొత్తం ప్రతిఫలం అగ్రిమెంటులో ఉందా. 
🔹 అగ్రిమెంటులో అందరి పాన్, ఆధార్‌ కార్డు వివరాలు ఉన్నాయా.

(D) రిజిస్ట్రేషన్‌కి ముందు 
🔹 మొత్తం మీ అకౌంటుకి జమ అయ్యిందా. 
🔹 రూ. 20,000 దాటి నగదు వ్యవహారం ఉందా 
🔹 బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఉందా 
🔹 నగదుని మీ అకౌంటులో/ మీ కుటుంబ సభ్యుల అకౌంటులో జమ చేస్తున్నారా 
🔹 టీడీఎస్‌ జరిగిందా? 26 ఏఎస్, ఏఐఎస్, 16బీ చెక్‌ చేయాలి. 
🔹 చలాన్లలో కరెక్టు మొత్తం.. అన్నీ ఉన్నాయా. 
🔹 సాక్షి సంతకాలు. మీ వాళ్లనే కనీసం ఒక్కరినైనా తీసుకెళ్లండి. వాళ్ల పాన్, ఆధార్‌ కార్డు పట్టుకోండి.

(E) రిజిస్ట్రేషన్‌ తర్వాత 
🔹 అమ్మిన వాళ్ల సేల్‌ డీడ్‌ కాపీ తీసుకోండి 
🔹 బ్యాంక్‌ లోన్‌ ఉన్నా కూడా సేల్‌ డీడ్‌ అడగండి 
🔹 బయ్యర్‌ ‘సోర్స్‌’ చెప్పడానికి రెడీగా ఉండాలి. ‘‘సోర్స్‌’’కి వివరణ, కాగితాలు ఉండాలి.  
🔹 సెల్లరు అయితే వెంటనే ట్యాక్స్‌ లయబిలిటీ స్టేట్‌మెంట్‌ చూసుకోవాలి. ఆలోచించాలి. పన్ను కట్టే పరిస్థితిలో పన్ను కట్టాలి. టీడీఎస్‌ని పరిగణనలోకి తీసుకుని లెక్కలు వేయాలి. వేరే ఆస్తి కొంటారా.. ఆలోచన, ప్లానింగ్‌ ఏమిటి? ఆస్తి కొనకపోతే క్యాపిటల్‌ గెయిన్స్‌ అకౌంటులో డిపాజిట్‌ చేయాలి. లేదా మినహాయింపు ఇచ్చే బాండ్లలో ఇన్వెస్ట్‌ చేయాలి.  

ఇందుకు సంబంధించిన గడువు తేదీలను ప్రస్తావిస్తూ ఒక ప్రణాళిక వేసుకోవాలి. కరెక్ట్‌ ఆర్థిక సంవత్సరంలో వ్యవహారం ప్రతిబింబించాలి. ఒరిజినల్‌ డీడ్స్, ఇంప్రూవ్‌మెంట్స్‌కి సంబంధించిన కాగితాలు, వివరణ, బ్యాంకు ఎంట్రీలు, థర్డ్‌ పార్టీతో ధ్రువీకరణ మొదలైనవి ఉండాలి. చివరగా, వ్యక్తిగత సమాచారంతో పాటు పార్టీ బాగోగులు, మంచి చెడ్డలు, స్వభావం, సహకారం, కుటుంబం గురించి, ఉద్దేశం గురించి, భవిష్యత్‌ ఆలోచనలు, చట్టం అంటే గౌరవం ఉందా లేదా, నిబద్ధత కలిగిన వ్యక్తేనా కాదా, క్రమశిక్షణ, చట్టంపై అవగాహన, విధేయత మొదలైనవి ఉన్నాయా లేదా అనేది కూడా పరిశీలించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement