ఎఫ్‌డీ రేట్లు సవరించిన బ్యాంకులు | PNB and Canara Bank revised their FD interest rates | Sakshi
Sakshi News home page

ఎఫ్‌డీ రేట్లు సవరించిన బ్యాంకులు

Jun 4 2025 12:50 PM | Updated on Jun 4 2025 12:50 PM

PNB and Canara Bank revised their FD interest rates

కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) జూన్ 1, 2025 నుంచి ఫిక్స్డ్‌ డిపాజిట్లపై సమ​కూరే వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. రూ.3 కోట్ల లోపు రిటైల్ టర్మ్ డిపాజిట్లపై తమ ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) వడ్డీ రేట్లను సవరించాయి. ఈ రెండు బ్యాంకులు నిర్దిష్ట కాలపరిమితిపై రేట్లను తగ్గించగా, ఎంపిక చేసిన దీర్ఘకాలిక డిపాజిట్లపై పీఎన్‌బీ రేట్లను పెంచింది.

కెనరా బ్యాంక్ ఎఫ్‌డీ వడ్డీ రేట్లు

కెనరా బ్యాంక్ సాధారణ కస్టమర్లకు 4% నుంచి 7% మధ్య, సీనియర్ సిటిజన్లకు 4% నుంచి 7.50% మధ్య ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను అందిస్తుంది. వీటిలో జూన్ 1, 2025 నుంచి కొన్ని సవరణలు చేసింది. కెనరా బ్యాంక్ ఏడాది కాలపరిమితికి ఎఫ్‌డీ వడ్డీ రేటును 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దాంతో ఇది 6.85% నుంచి 6.75%కి తగ్గింది. మూడు సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ, 5 సంవత్సరాల కంటే తక్కువ ఎఫ్‌డీ కాలపరిమితికి వడ్డీ రేటును 7% నుంచి 6.75% కు 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది.

పీఎన్‌బీ ఇలా..

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) రూ.3 కోట్ల లోపు రిటైల్ డిపాజిట్లపై ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. కొత్త రేట్లు జూన్ 1, 2025 నుంచి అమల్లోకి వస్తాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సాధారణ పౌరులకు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాలపరిమితికి 3.50% నుంచి 6.90% మధ్య ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను అందిస్తుంది. 390 రోజుల కాలపరిమితిపై అత్యధికంగా 6.9 శాతం వడ్డీ లభిస్తుంది. గతంలో 390 రోజుల కాలపరిమితిపై అత్యధికంగా 7 శాతం వడ్డీని ఆఫర్ చేసేవారు.

ఇదీ చదవండి: విద్యా రుణాలపై వడ్డీ రేటు తగ్గింపు

ఏడాది నుంచి 390 రోజుల కాలపరిమితి కలిగిన ఎఫ్‌డీలపై వడ్డీ రేటును పంజాబ్ నేషనల్ బ్యాంక్ 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. 390 రోజుల కాలపరిమితిపై వడ్డీ రేటును 7 శాతం నుంచి 6.90 శాతానికి సవరించారు. 391 రోజుల నుంచి 505 రోజుల కాలపరిమితిపై వడ్డీ రేటును 6.80 శాతం నుంచి 6.70 శాతానికి, 506 రోజుల కాలపరిమితిపై 6.70 శాతం నుంచి 6.60 శాతానికి తగ్గించారు. 507 రోజుల నుంచి రెండేళ్ల కాలపరిమితిపై వడ్డీ రేటును 6.80 శాతం నుంచి 6.70 శాతానికి తగ్గించారు. 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై వడ్డీ రేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.75 శాతం నుంచి 6.70 శాతానికి తగ్గించింది.

వడ్డీరేట్లు పెంపు వీరికే..

సీనియర్ సిటిజన్లకు పీఎన్‌బీ బ్యాంక్‌ ఇప్పటివరకు 4% నుంచి 7.40% వరకు వడ్డీ రేట్లను అందిస్తుంది. సూపర్ సీనియర్ సిటిజన్లకు రేట్లు కాస్త ఎక్కువగా ఉంటాయి. సవరించిన తర్వాత 4.30% నుంచి 7.70% వరకు వడ్డీ ఇస్తుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement