పబ్లిక్‌ ఇష్యూకు ప్లేసింపుల్‌ గేమ్స్‌ | PlaySimple Games Files for Rs 3150 Crore IPO | Sakshi
Sakshi News home page

పబ్లిక్‌ ఇష్యూకు ప్లేసింపుల్‌ గేమ్స్‌

Apr 26 2026 7:23 AM | Updated on Apr 26 2026 7:25 AM

PlaySimple Games Files for Rs 3150 Crore IPO

ముంబై: స్వీడన్‌కు చెందిన గేమింగ్‌ దిగ్గజం మోడర్న్‌ టైమ్స్‌ గ్రూప్‌ (ఎంటీజీ ఏబీ)కి చెందిన భారతీయ అనుబంధ సంస్థ ప్లేసింపుల్‌ గేమ్స్‌ ఐపీఓ ద్వారా రూ.3,150 కోట్ల నిధుల సమీకరణకు సిద్ధమైంది. ఇందుకోసం సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించింది. 

‘ఈ పబ్లిక్‌ ఇష్యూ పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) రూపంలో ఉంటుంది. ఇందులో ప్రమోటర్, సెల్లింగ్‌ షేర్‌హోల్డర్‌గా ఎంటీజీ వ్యవహరిస్తుంది. అందువల్ల, ఈ ఇష్యూ ద్వారా వచ్చే నిధులు ప్లేసింపుల్‌కి కాకుండా ఎంటీజీకే వెళ్తాయి’ అని డ్రాఫ్ట్‌ పత్రాల్లో తెలిపింది. ఐపీఓ పూర్తైన తర్వాత కూడా ప్లేసింపుల్‌లో మెజారిటీ వాటాను కొనసాగించాలనే ఉద్దేశం ఉందని ఎంటీజీ వివరణ ఇచ్చింది. ప్రస్తుతం ఆఫర్‌ పరిమాణం రూ. 3,150 కోట్లుగా ఉన్నప్పట్టకీ.. నియంత్రణ పరిమితుల్లో ఆఫర్‌ పరిమాణం మారవచ్చు. పబ్లిక్‌ ఇష్యూ తేదీని త్వరలో నిర్ణయిస్తామని కంపెనీ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement