అలాంటి రూ. 500 నోట్లు చెల్లవా?.. ఇది తెలుసుకోండి

 PIB Fact Check Handle Quashed Rumours That Notes - Sakshi

సోషల్‌ మీడియాలో రూ. 500 నోటుకు సంబంధించిన ఓ ఫేక్‌ వార్త చక్కర్లు కొడుతోంది. ఆ నోటు నకిలీదో లేక ఒరిజినల్‌దో ఇలా తెలుసుకోవాలని అధికారిక ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్‌ చెక్‌(PIB) ట్విట్టర్‌లో తెలిపింది. 

కాగా, ఓ 500 రూపాయల నోటుపై గాంధీ బొమ్మ.. ఆకుపచ్చ గీతకు దగ్గరగా RBI గవర్నర్ సంతకంపైన.. ఉన్న నోటు నకిలీది అని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై పీఐబీ క్లారిటీ ఇచ్చింది. నోటుపై ఉన్న గాంధీ బొమ్మ ఆకుపచ్చ గీతకు దగ్గరగా, దూరంగా ఉన్న రెండు నోట్లు సరైనవేనని తెలిపింది. “RBI ప్రకారం రెండు రకాల నోట్లు చెల్లుబాటు అవుతాయి.” అని పేర్కొంది. 

ఈ క్రమంలోనే కొత్తగా విడుదలవుతున్న రూ. 500 నోట్లు ప్రస్తుతం రంగు, పరిమాణం, థీమ్‌, భద్రతా ఫీచర్ల స్థానం, డిజైన్‌ అంశాలలో పాత సిరీస్‌కు భిన్నంగా ఉన్నాయని స్పష‍్టం చేసింది. కొత్త నోటు పరిమాణం 66mm x 150mm ఉందని తెలిపింది. ఒక నోటు నకిలీదో కాదో నిర్ధారించుకోవడానికి, ఆర్‌బీఐ పాయింటర్లు, ప్రభుత్వ నిజ నిర్ధారణ సంస్థల్లో తెలుసుకోవాలని సూచించింది. సోషల్‌ మీడియాలో వచ్చే ఫేక్‌ వార్తలను నమ్మవద్దని హితవు పలికింది.

ఇది కూడా చదవండి: ఈలాన్‌మస్క్‌కి మద్దతు పలికిన కేంద్ర మంత్రి!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top