
చాట్‌జీపీటీ యూజర్లు పాపులర్ ఏఐ చాట్‌బాట్‌ను గుడ్డిగా నమ్మకూడదని ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ కోరారు. ఓపెన్ఏఐ అధికారిక పాడ్‌కాస్ట్ మొదటి ఎపిసోడ్‌లో ఆయన మాట్లాడారు. చాట్‌జీపీటీ ఒక టెక్నాలజీ అని.. ఆశ్చర్యకరంగా దాన్ని చాలామంది వినియోగదారులు అమితంగా విశ్వసిస్తున్నారని చెప్పారు. చాట్‌జీపీటీలో నిర్దిష్ట పరిమితులున్నాయని తెలిపారు. అందుకే దీనిపై ప్రజలకు చాలా నమ్మకం ఉందన్నారు. కానీ ఏఐ చాట్‌బాట్‌ను వినియోగదారులు గుడ్డిగా నమ్మకూడదని పేర్కొన్నారు.
‘చాట్‌జీపీటీని వినియోగదారులు సహేతుకమైన సందేహాలు అడగాలి. అడ్డదిడ్డ ప్రశ్నలడిగితే సమాధానాలు భిన్నంగా ఉండవచ్చు. చాట్‌జీపీటీపై ప్రజలకు చాలా నమ్మకం ఉంది. ఏఐ కొన్నిసార్లు భ్రాంతులు(Hallucination) కలిగిస్తుంది. ఏఐ చాట్‌బాట్ నమ్మదగిన, కల్పిత సమాచారాన్ని సృష్టించగలదు. ఎల్‌ఎల్‌ఎంలోని డేటా నమూనాల ఆధారంగా ఏఐ టెక్ట్స్‌ను అంచనా వేస్తుంది. ఇది మానవుల మాదిరిగా వాస్తవాలను తెలుసుకోదు. ఏఐ టూల్స్‌పై ఆధారపడటం ఎక్కువవుతోంది. పిల్లల పెంపకం కోసం సలహా అడగడం దగ్గర నుంచి ఇన్నోవేషన్ పరిశోధన వరకు ప్రతిదానికీ చాట్‌జీపీటీని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. అయినప్పటికీ యూజర్లు కీలకమైన సమాచారాన్ని స్వతంత్రంగా ధ్రువీకరించుకోవాలి’ అని ఆల్ట్‌మన్ నొక్కి చెప్పారు.
ఇదీ చదవండి: మస్క్ కంపెనీలో ఉద్యోగం కావాలా?
సరి చూసుకోవాల్సిందే..
కీలక విషయాలకు సంబంధించిన ఏఐ సమాచారాన్ని ధ్రువీకరించుకునేందుకు టెక్ నిపుణులు కొన్ని మార్గాలను సూచిస్తున్నారు. వారి వివరాల ప్రకారం.. ఏఐ సమాచారాన్ని విశ్వసనీయ వార్తా సంస్థలు, ప్రభుత్వ పోర్టల్స్ లేదా అకడమిక్ సైట్లలో(ఉదా., .gov, .edu, లేదా పీర్-రివ్యూడ్ జర్నల్స్) సరిచూసుకోవాలి. ఏఐ సమాచారం ఇతర విశ్వసనీయ సైట్‌ల్లో ఒకేలా ఉంటే కొంతవరకు ఏకాభిప్రాయానికి రావొచ్చు. ఏఐ చాలాసార్లు పాత డేటాను క్రీడికరిస్తుంది. లేటెస్ట్ వివరాలను సరిచేసుఏకోవాలి. ఏఐ వివరాలు వినియోగదారుల క్రిటికల్ థింకింగ్‌కు పొంతనలేకుండా అనిపిస్తే వెంటనే అధికారికంగా ధ్రువీకరించుకోవాలి.