Pebble Cosmos Bold Pro Smartwatch launched in India - Sakshi
Sakshi News home page

Pebble Cosmos Bold Pro: మార్కెట్లో 'పెబల్ కాస్మోస్ బోల్డ్ ప్రో' స్మార్ట్‌వాచ్ లాంచ్ - ధర ఎంతంటే?

May 1 2023 1:55 PM | Updated on May 1 2023 3:04 PM

Pebble cosmos bold pro smart watch launched price and details - Sakshi

దేశీయ మార్కెట్లో పెబల్ కంపెనీ నుంచి కొత్త స్మార్ట్‌వాచ్ విడుదలైంది. పెబల్ కాస్మోస్ బోల్డ్ ప్రో (Pebble Cosmos Bold Pro) పేరుతో విడుదలైన ఈ వాచ్ ధర రూ. 2,799. ఇది ఈ-కామర్స్ ప్లాట్‍ఫామ్ ఫ్లిప్‍కార్ట్, పెబల్ అధికారిక వెబ్‍సైట్‍లో విక్రయానికి ఉంది. ఈ లేటెస్ట్ వాచ్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

మార్కెట్లో విడుదలైన కొత్త 'పెబల్ కాస్మోస్ బోల్డ్ ప్రో' వాచ్ నాలుగు కలర్ ఆప్షన్‍లలో ఉంటుంది. అవి బ్లాక్, గోల్డ్, మెటల్ బ్లాక్, సిల్వర్ కలర్స్. మెటల్ బాడీ కలిగిన ఈ వాచ్ 1.39 ఇంచెస్ TFT డిస్ప్లేతో లభిస్తుంది. ఇందులో హార్ట్ మానిటర్ చేయడానికి ఒక ప్రత్యేకమైన ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. అంతే కాకుండా బ్లడ్ ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ కొలిచే ఎస్‍పీఓ2 సెన్సార్ వంటి ఫీచర్స్ కూడా ఇందులో లభిస్తాయి.

(ఇదీ చదవండి: విడుదలకు సిద్దమవుతున్న హ్యుందాయ్ క్రెటా ఈవీ.. లాంచ్ ఎప్పుడంటే?)

బ్లూటూత్ 5.0 వెర్షన్ కనెక్టివిటీ కలిగి ఉండటం వల్ల ఇది కాలింగ్ ఫీచర్‌ కూడా పొందుతుంది. బ్లూటూత్ ద్వారా మొబైల్ కి కనెక్ట్ చేసుకున్నప్పుడు వాచ్ ద్వారానే కాల్స్ స్వీకరించవచ్చు, రిజెక్ట్ చేయవచ్చు. నోటిఫికేషన్లను కూడా వాచ్ ద్వారానే తీసుకోవచ్చు. మ్యూజిక్ ప్లేబ్యాక్, కెమెరా వంటి వాటిని కూడా వాచ్ ద్వారానే కంట్రోల్ చేయవచ్చు.

(ఇదీ చదవండి: ఒక్కసారిగా రూ. 171 తగ్గిన ఎల్‌పీజీ గ్యాస్ ధరలు.. కొత్త ధరలు ఎలా ఉన్నాయంటే?)

పెబల్ కాస్మోస్ బోల్డ్ ప్రో స్మార్ట్ వాచ్ ఒక ఫుల్ ఛార్జ్ ద్వారా సాధారణంగా వారం (7 రోజులు) రోజుల వరకు పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. అయితే ఎక్కువ ఉపయోగించినప్పుడు బ్యాటరీ లైఫ్ ఇంకా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఈ స్మార్ట్ వాచ్ ఆధునిక కాలంలో వినియోగించడానికి చాలా అద్భుతంగా ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement