పేటీఎం నష్టాలు తగ్గాయ్‌

Paytm Q3 consolidated loss narrows to Rs 392 crore - Sakshi

న్యూఢిల్లీ: డిజిటల్‌ చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ (పేటీఎం) డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నష్టాలు తగ్గించుకుంది. కన్సాలిడేటెడ్‌గా రూ.392 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నష్టం రూ.778 కోట్లతో పోలిస్తే దాదాపు సగం తగ్గినట్టు తెలుస్తోంది. ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో పోల్చి చూసినప్పుడు 42 శాతం పెరిగి రూ.2,062 కోట్లకు చేరింది.

ఈసాప్‌ వ్యయాలు మినహాయించి చూస్తే డిసెంబర్‌ త్రైమాసికంలో నిర్వహణ లాభం లక్ష్యాన్ని చేరుకున్నట్టు (ఎబిటా బ్రేక్‌ ఈవెన్‌) పేటీఎం వ్యవస్థాపకుడు, సంస్థ సీఈవో విజయ్‌ శేఖర్‌ శర్మ తెలిపారు. 2023 సెప్టెంబర్‌ త్రైమాసికంలో దీన్ని చేరుకుంటామని చెప్పగా, అంతకు మూడు త్రైమాసికాల ముందే సాధించినట్టు ప్రకటించారు. మార్కెట్‌ ముగిసిన తర్వాత ఈ ఫలితాలు విడుదలయ్యాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top