వ్యాక్సిన్‌ స్లాట్‌ బుకింగ్‌కు మరో మార్గం ?

Paytm MakeMyTrip Infosys Offer To Help  COVID Vaccine Bookings - Sakshi

థర్డ్‌పార్టీ అప్లికేషన్లకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌

లిస్టులో పేటీఎం, మేక్‌ మై ట్రిప్‌ తదితర సంస్థలు

త్వరలో విధివిధానాలు ప్రకటించనున్న సంస్థలు

వెబ్‌డెస్క్‌ : కోవిన్‌ యాప్‌తో పాటు ఇతర ప్రైవేటు అప్లికేషన్ల ద్వారా కూడా త్వరలో వ్యాక్సినేషన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభం కానుంది. పేటీఎం, మేక్‌ మై ట్రిప్‌తో పాటు మరికొన్ని సంస్థలు వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో ప్రభుత్వానికి సహాకరించేందుకు ముందుకు వచ్చాయంటూ రాయిటర్స్‌ సంస్థ కథనం ప్రచురించింది.  

థర్డ్‌పార్టీ
టీకా రిజిస్ట్రేషన్‌లో ఎదురవుతున్న సమస్యలు తీర్చేందుకు కేంద్రం మరో ముందడుగు వేసింది. టీకా రిజిస్ట్రేషన్‌ సేవల్లో ప్రభుత్వంతో పాటు ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు గత నెలలలో ఆదేశాలు జారీ చేసింది. దీనికి అనుగుణంగా కోవిడ్ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో పాల్గొనేందుకు పలు ప్రైవేటు సంస్థలు ఆసక్తి చూపించాయి. అపోలో, మాక్స్‌ వంటి ఆస్పత్రులతో పాటు మేక్‌ మై ట్రిప్‌, 1 మిల్లీగ్రామ్‌, పేటీఎం, ఇన్ఫోసిస్‌ తదితర మొత్తం 15 సంస్థలు ఈ సేవలు ప్రారంభించే అవకాశం ఉందని రాయిటర్స్‌ పేర్కొంది. 

సహాయకారిగా
మేక్‌​ మై ట్రిప్‌ సీఈవో రాజేశ్‌ మాగౌ మాట్లాడుతూ వ్యాక్సిన్‌ బుకింగ్‌ చేసుకునేందుకు ప్రజలకు సహయకారిగా ఉండాలని నిర్ణయించామని, అందుకే మేక్‌ మై ట్రిప్‌ ద్వారా వ్యాక్సిన్‌ స్లాట్‌ బుకింగ్‌ సేవలకు ముందుకు వచ్చామని వివరించారు. అయితే ఈ అంశంపై స్పందించేందుకు పేటీఎం,అపోలో, మాక్స్‌ నిరాకరించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. పేటీఎంకి వెబ్‌సైట్‌కి పది కోట్ల మంది యాక్టివ్‌ యూజర్లు ఉన్నారు. మేక్‌ మై ట్రిప్‌ అప్లికేషన్‌కి 1.20 కోట్ల మంది చందాదారులు ఉన్నారు.

చదవండి: కోవిడ్‌ టీకా డోస్‌ల వృథాలో జార్ఖండ్‌ టాప్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top