
అన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు
నిషేధిత భూముల వివరాలకు ప్రత్యేక పోర్టల్
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో చేపట్టిన సంస్కరణల్లో భాగంగా జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేయనున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. స్లాట్‌బుకింగ్ విధానంపై శనివారం ఆయ న సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇప్పటికే ప్రయోగాత్మకంగా 47 కార్యాలయా ల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేస్తుండగా, జూన్ 2 నుంచి అన్నిచోట్లా అమల్లోకి తెస్తున్నామని మంత్రి తెలిపా రు. స్లాట్‌బుకింగ్ ద్వారా ఇప్పటివరకు 36 వేలకు పైగా లావాదేవీలు జరిగాయని, ఈ విధానంపై 94% మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని వెల్ల డించారు.
ఉదయం 10:30 గంటల నుంచి మధ్యా హ్నం 1:30 గంటల మధ్య, తిరి గి మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల మధ్య స్లాట్ బుకింగ్‌కు అవకాశముంటుందని తెలి పారు. స్లాట్‌బుకింగ్ విధానం అమలవుతున్న దృష్ట్యా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పు నర్వ్యవస్థీకరణ జరుగుతోందని చెప్పారు. పని భారం ఎక్కు వగా ఉండే పటాన్‌చెరు, యాదగిరిగుట్ట, గండిపేట, ఇబ్రహీంపట్నం, సూర్యాపేట, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల కార్యాలయాల్లో అదనపు సబ్‌రిజిస్ట్రార్‌తో పాటు సిబ్బందిని నియమిస్తామని ప్రకటించారు.
భూ భా రతి తరహాలోనే ప్రత్యేకంగా ఒక పోర్టల్ తయారు చేసి అందులో నిషేధిత భూములు, ఆస్తుల వివరాలను పొందుపరుస్తామని వెల్లడించారు. ఎక్కడ నిషేధిత భూమి రిజిస్ట్రేషన్ జరిగినా క్షణాల్లో ప్రధాన కా ర్యాలయానికి తెలిసేలా ఆన్‌లైన్ వ్యవస్థను ఏర్పాటు చేశామని, ఇలాంటి ఘటనలు ఎక్కడైనా జరిగితే అధికారులపై కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.
నేడు జీపీఓ పరీక్ష : గ్రామ పాలనాధికారి (జీపీఓ) నియామకాలకు ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష నిర్వహిస్తున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. దాదాపు 5 వేల మంది ఈ పరీక్షకు హాజరవుతారని, జేఎన్టీయూ ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహిస్తున్నామని చెప్పారు. గతంలో వీఆర్వో, వీఆర్‌ఏలుగా పనిచేసిన వారిలో ఆసక్తి ఉన్నవారిని వీలైనంత త్వరగా ఈ పోస్టుల్లో నియమిస్తామని వెల్లడించారు.