టీ హబ్‌కి ఎంపీలు ఫిదా.. మంత్రి కేటీఆర్‌ని మెచ్చుకున్న ఫ్రైర్‌బ్రాండ్‌

Parliament IT Standing Committee Accolades T IT Hub - Sakshi

THubHyd: స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు హైదరాబాద్‌లో ఏ‍ర్పాటు చేసిన తెలంగాణ హబ్‌ని పార్లమెంట్‌ ఐటీ స్టాండింగ్‌ కమిటీ ప్రశంసించింది. శశిథరూర్‌ నేతృత్వంలోని  పార్లమెంటు ఐటీ స్టాండింగ్‌ కమిటీ ఇటీవల టీ ఐటీ హబ్‌ని సందర్శించారు. ఇక్కడ స్టార్టప్‌లకు అందుతున్న సౌకర్యాలు, ప్రభుత్వపరమైన ప్రోత్సహాకాలను వారు పరిశీలించారు. 


మంత్రి కేటీఆర్‌కు ప్రశంసలు
తెలంగాణ ఐటీ హబ్‌ పనితీరును పశ్చిమ బెంగాల్‌కి చెందిన టీఎంసీ ఎంపీ, ఫైర్‌బ్రాండ్‌ మహువా మెయిత్రా మెచ్చుకున్నారు. 70 వేల చదరపు అడుగుల ఇంక్యుబేటర్‌ సెంటర్‌ని త్వరలోనే 3.50 లక్షల అడుగుల చదరపు అడుగులకు విస్తరిస్తున్నారు. ఒక ఐడియాతో తెలంగాణ ఐటీ హబ్‌లోకి వెళితే ప్రొడక్టుతో బయటకు రావొచ్చంటూ ఆమె ట్వీట్‌ చేశారు. అంతేకాదు వండర్‌ఫుల్‌ జాబ్‌ ఆల్‌ అరౌండ్‌ కేటీఆర్‌టీఆర్‌ఎస్‌ అంటూ ప్రశంసించారు.

థ్యాంక్యూ
మహువా మోయిత్రా ప్రశంసల ట్వీట్‌కి మంత్రి కేటీఆర్‌ స్పందించారు. థ్యాంక్యూ మహువా  జీ అంటూ ట్వీట్‌ చేశారు.

తమిళనాడుకి అవసరం
మరోవైపు తమిళనాడుకు చెందిన కార్తి చిదంబరం సైతం ఐటీ హబ్‌ని మెచ్చుకున్నారు. ఇటువంటి ఐటీ హబ్‌ తమిళనాడుకు అవసరం ఉందంటూ ట్వీట్‌ చేశారు. టీ  హబ్‌ ఈజ్‌ వెరీ ఇంప్రెసివ్‌ అండ్‌ ఎఫెక్టివ్‌ ఇన్షియేటివ్‌ అంటూ ట్వీట్‌ చేశారు.

చదవండి : ఆన్‌లైన్‌లోకి ఆటో మొబైల్‌.. భారీగా నియామకాలు!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top