భారత్‌ బయోటెక్‌తో యూఎస్‌ కంపెనీ జత

Ocugen US ties with Bharat biotech to co-develop Covaxin - Sakshi

కోవిడ్‌-19‌ వ్యాక్సిన్‌ అభివృద్ధిలో భాగస్వామ్యం

యూఎస్‌లో క్లినికల్‌ పరీక్షలు, రిజిస్ట్రేషన్‌లకు సై

తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్న ఆక్యుజెన్‌

తద్వారా యూఎస్‌లో ఆక్యుజెన్‌కు కోవాగ్జిన్‌ హక్కులు

ముంబై, సాక్షి: కరోనా వైరస్‌ కట్టడికి దేశీ కంపెనీ భారత్‌ బయోటెక్‌తో తాజాగా యూఎస్‌ ఫార్మా కంపెనీ ఆక్యుజెన్‌ చేతులు కలిపింది. తద్వారా భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేస్తున్న కోవాగ్జిన్‌ తదుపరి అభివృద్ధి దశలను యూఎస్‌లో ఆక్యుజెన్‌ చేపట్టనుంది. ఇందుకు కట్టుబడేందుకు వీలుగా రెండు కంపెనీలు ఒప్పందం(ఎల్‌వోఐ)పై సంతకాలు చేశాయి. ఎల్‌వోఐలో భాగంగా ఆక్యుజెన్‌ యూఎస్‌లో కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ హక్కులను పొందనుంది. భారత్‌ బయోటెక్‌ సహకారంతో యూఎస్‌లో వ్యాక్సిన్‌కు సంబంధించిన క్లినికల్‌ డెవలప్‌మెంట్‌, రిజిస్ట్రేషన్‌, వాణిజ్య వ్యవహారాలను ఆక్యుజెన్‌ చేపట్టనుంది. ప్రస్తుతం రెండు కంపెనీలూ పరస్పరం సహకరించుకునేందుకు నిర్ణయించుకున్నట్లు ఒక ప్రకటనలో తెలియజేశాయి. పూర్తిస్థాయి ఒప్పంద వివరాలను కొద్ది వారాలలో వెల్లడించనున్నట్లు తెలియజేశాయి. ఒప్పందం ప్రకారం యూఎస్‌లో వ్యాక్సిన్‌ సైంటిఫిక్‌ అడ్వయిజరీ బోర్డ్‌ను ఆక్యుజెన్‌ ఏర్పాటు చేయనుంది. తద్వారా అక్కడ క్లినికల్‌ పరీక్షల డేటా, నియంత్రణ సంస్థల అనుమతులు తదితర వ్యవహారాలను చేపట్టనుంది. (సీరమ్‌ నుంచి 5 కోట్ల డోసేజీలకు రెడీ)

కోవాగ్జిన్‌ ప్రత్యేకం
చరిత్రలో నిరూపితమైన విధానాల బాటలోనే కోవిడ్‌-19 కట్టడికి భారత్‌ బయోటెక్‌ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు ఒప్పందం సందర్భంగా హార్వే రూబిన్‌ పేర్కొన్నారు. వెరసి యూఎస్‌లో అందుబాటులోకి వస్తున్న ఇతర వ్యాక్సిన్లతో పోలిస్తే కోవాగ్జిన్‌ ప్రత్యేకమైనదని తెలియజేశారు. వైరస్‌పై మరింత సమర్ధవంతంగా పనిచేయగలదని అభిప్రాయపడ్డారు. పెన్సిల్వేనియా యూనివర్శిటీ పీహెచ్‌డీ ఎండీ అయిన రూబిన్‌.. ఆక్యుజెన్‌ సైంటిఫిక్‌ సలహాదారుల బోర్డు సభ్యులుకావడం గమనార్హం! దేశీయంగా మెడికల్‌ రీసెర్చ్‌ కౌన్సిల్‌(ఐసీఎంఆర్‌) సహకారంతో భారత్‌ బయోటెక్.. కోవాగ్జిన్‌ను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. అత్యవసర ప్రాతిపదికన వ్యాక్సిన్‌ వినియోగానికి అనుమతించవలసిందిగా ఇటీవలే డీసీజీఐకు భారత్‌ బయోటెక్‌ దరఖాస్తు చేసింది. 26,000 మందిపై చేపట్టనున్న మూడో దశ క్లినికల్‌ పరీక్షల కోసం ఇప్పటికే 13,000 మంది వాలంటీర్లను సమకూర్చుకుంది. (అందరికీ వ్యాక్సిన్లు కష్టతరమే!)

మైలురాయి..
దేశీయంగా వ్యాక్సినాలజీలో కోవాగ్జిన్‌ అభివృద్ధి, క్లినికల్‌ డేటా ఒక మైలురాయి వంటిదని భారత్‌ బయోటెక్ చైర్మన్‌ కృష్ణ ఎల్లా పేర్కొన్నారు. వైరస్‌ కట్టడికి రూపొందిస్తున్న కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌పై పలు దేశాల నుంచి సరఫరాలు తదితరాల కోసం ఆసక్తి వ్యక్తమవుతున్నట్లు చెప్పారు. ఆక్యుజెన్‌తో భాగస్వామ్యం ద్వారా యూఎస్‌ మార్కెట్లలోనూ వ్యాక్సిన్‌ను ప్రవేశపెట్టే వీలు చిక్కిందని తెలియజేశారు. ఇది తమకెంతో ప్రోత్సాహాన్నిస్తున్నట్లు చెప్పారు. వ్యాక్సిన్‌ తొలి రెండు దశల క్లినికల్‌ పరీక్షలలో ఫలితాలతో తాము సంతృప్తి చెందినట్లు ఆక్యుజెన్‌ సహవ్యవస్థాపకుడు, చైర్మన్‌ శంకర్‌ ముసునూరి చెప్పారు. దేశీయంగా మూడో దశ  పరీక్షలు సైతం ప్రోత్సాహకరంగా సాగుతున్నట్లు తెలియజేశారు. సంప్రదాయ పద్ధతిలో ప్రత్యేకంగా రూపొందిస్తున్న ఈ వ్యాక్సిన్‌కు భారీ అవకాశాలున్నట్లు అంచనా వేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ప్రయోజనకారిగా నిలిచే అవకాశమున్నట్లు అభిప్రాయపడ్డారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

08-03-2021
Mar 08, 2021, 08:24 IST
తప్పుడు చిరునామా, ఫోన్‌ నంబర్‌ ఇవ్వడం వల్ల ఇద్దరికి బ్రిటన్‌ స్ట్రెయిన్‌ వచ్చి నా... వారిని పట్టుకోవడం అధికారులకు సవాల్‌గా...
08-03-2021
Mar 08, 2021, 06:10 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌ వైరస్‌ సోకుతుందన్న భయం లేకపోవడం, స్థానిక సంస్థల ఎన్నికలు, పెళ్లిళ్ల సీజన్‌ వెరసి మహారాష్ట్రలో భారీగా కేసులు...
07-03-2021
Mar 07, 2021, 06:25 IST
ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ప్రధాని మోదీ ఫొటోను ప్రచురించడం ద్వారా ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారంటూ తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ...
07-03-2021
Mar 07, 2021, 06:21 IST
న్యూఢిల్లీ: కొత్తగా కరోనా కేసుల ఉధృతి పెరుగుతున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని కేంద్రం కోరింది. 60...
07-03-2021
Mar 07, 2021, 03:55 IST
సాక్షి, అమరావతి: విద్యార్థులు, బోధన సిబ్బంది ఆరోగ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది. విద్యా సంస్థలకు వచ్చే విద్యార్థులకు, బోధన...
06-03-2021
Mar 06, 2021, 14:48 IST
కిడ్నీ వ్యాధి ఉందన్న విషయం తెలిసిన తల్లిదండ్రులు బాలుడిని నిలోఫర్‌ ఆస్పత్రిలో వదిలేసి వెళ్లిపోయారు
05-03-2021
Mar 05, 2021, 10:46 IST
రిలయన్స్ గ్రూప్‌ ఉద్యోగులందరికీ ఉచితం గా కరోనా టీ​కాను  అందిస్తామని రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్, ముఖేశ్‌ అంబానీ సతీమణి నీతా అంబానీ  ప్రకటించారు.  ...
05-03-2021
Mar 05, 2021, 04:21 IST
బ్రెజీలియా: బ్రెజిల్‌లో కోవిడ్‌ –19 విలయతాండవం చేస్తోంది. రికార్డు స్థాయిలో మరణాలు నమోదవుతున్నాయి. రోజుకి సగటున 2 వేల మంది...
04-03-2021
Mar 04, 2021, 13:12 IST
ఢిల్లీ వసంత కుంజ్ లోని ఫోర్టిస్ ఆసుపత్రిలో గురువారం కేంద్ర  ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ కోవిడ్‌ వ్యాక్సిన్‌  తొలి డోస్‌ను...
04-03-2021
Mar 04, 2021, 11:31 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ గురువారం కోవిడ్‌ వాక్సిన్‌ తీసుకున్నారు. రెండవ దశ  కరోనా వ్యాక్సినేషన్‌లో భాగంగా ఆయన...
04-03-2021
Mar 04, 2021, 03:29 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా టీకా పంపిణీ వేళలపై ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తొలగించింది. ఇకపై రోజులో ఏ సమయంలోనైనా...
03-03-2021
Mar 03, 2021, 14:54 IST
సాక్షి,  న్యూఢిల్లీ: దేశంలో రెండో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.  మొదటి దశలో  ఫ్రంట్‌లైన్, ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్‌ను అందించగా,...
03-03-2021
Mar 03, 2021, 11:43 IST
మహారాష్ట్రలో వ్యాక్సిన్‌  డోసు తీసుకొన్న కొద్ది సేపటికే ఒక వ్యక్తి మరణించడం కలకలం రేపుతోంది.
03-03-2021
Mar 03, 2021, 03:53 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 0.25 శాతంగా నమోదైంది. జనవరి 21 నుంచి ఫిబ్రవరి 21 వరకు...
02-03-2021
Mar 02, 2021, 13:12 IST
 దేశంలో గత 24 గంటల్లో 12,286  కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి.
02-03-2021
Mar 02, 2021, 12:40 IST
సరిగ్గా ఏడాది క్రితం దేశరాజధాని ఢిల్లీలో ప్రముఖ ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రిలో వైద్యసిబ్బంది కోవిడ్‌ మహమ్మారిపై అవిశ్రాంత పోరాటాన్ని ప్రకటించారు.
02-03-2021
Mar 02, 2021, 05:07 IST
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(70) ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్‌)లో సోమవారం ఉదయం 6.30 గంటలకు కరోనా...
01-03-2021
Mar 01, 2021, 20:16 IST
భారత్‌ అభివృద్ధి చేస్తోన్న కరోనా వ్యాక్సిన్‌ డాటాని హ్యాక్‌ చేసేందుకు యత్నం
01-03-2021
Mar 01, 2021, 16:52 IST
తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,10,96,731కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. కేవలం ఆరు రాష్ట్రాల్లోనే అధిక శాతం...
01-03-2021
Mar 01, 2021, 14:32 IST
ఎస్‌ఎస్‌ తాడ్వాయి: ములుగు జిల్లా ఎస్‌ఎస్‌ తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క– సారలమ్మ ఆలయాన్ని సోమవారం నుంచి 21 రోజుల...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top