డిసెంబర్‌ నుంచి ఎన్‌ఎస్‌ఈ వ్యవసాయ కమోడిటీ ఫ్యూచర్స్‌ | NSE to launch first agricultural commodity futures contract | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌ నుంచి ఎన్‌ఎస్‌ఈ వ్యవసాయ కమోడిటీ ఫ్యూచర్స్‌

Nov 10 2020 5:47 AM | Updated on Nov 10 2020 5:47 AM

NSE to launch first agricultural commodity futures contract - Sakshi

న్యూఢిల్లీ: స్టాక్‌ ఎక్సే్చంజీ ఎన్‌ఎస్‌ఈ వచ్చే నెల నుంచి వ్యవసాయ కమోడిటీ ఫ్యూచర్స్‌ కాంట్రాక్టులను అందుబాటులోకి తెస్తోంది. డిసెంబర్‌ ఒకటిన ముడి సోయాబీన్‌ ఆయిల్‌ కాంట్రాక్టుతో తమ తొలి వ్యవసాయ కమోడిటీ ఫ్యూచర్స్‌ కాంట్రాక్టును ప్రవేశపెడుతున్నట్లు సంస్థ తెలిపింది. సోయాబీన్‌ ఆయిల్‌ ప్రాసెసింగ్, అనుబంధ పరిశ్రమల సంస్థలు .. ధరలను హెడ్జ్‌ చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది. లాట్‌ పరిమాణం 10 మెట్రిక్‌ టన్నులుగాను, కాంట్రాక్టు సెటిల్మెంట్‌ నెలవారీగాను ఉంటుందని తెలిపింది. దేశీ కమోడిటీ మార్కెట్లను మరింతగా విస్తరించేందుకు ఇలాంటి సాధనాలు ఉపయోగపడగలవని ఎన్‌ఎస్‌ఈ ఎండీ, సీఈవో విక్రమ్‌ లిమాయే తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement