
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులపై గ్యారంటీ రాబడిని అందిస్తామంటూ కొంతమంది వ్యక్తులు ఇన్వెస్టర్లను మోసగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని సాక్ట్ ఎక్స్ఛేంజీ దిగ్గజం ఎన్‌ఎస్‌ఈ (NSE నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్) తెలిపింది. కొన్ని సంస్థల పేరుతో మదుపర్లను బురిడీ కొట్టించి వారి నుంచి ట్రేడింగ్ అకౌంట్ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ వంటి వివరాలను తీసుకుంటున్నారని, ఇటువంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చిరించింది.
మోసగాళ్లు.. వారి ఫోన్‌నంబర్లు ఇవే..
ఇటీవల తమ దృష్టికి వచ్చిన కొంత మంది మోసపూరిత వ్యక్తులు.. వారి ఫోన్ నంబర్లు, వారు పేర్కొన్న సంస్థల వివరాలను ఎస్‌ఎస్‌ఈ వెల్లడించింది.
“టీజీ లెవెల్” (TG Level) అనే సంస్థ పేరుతో మొబైల్ నంబర్ 8420583592 ద్వారా మోసగిస్తున్నారు.
“వీవీఎల్” (VVL) అనే సంస్థ పేరుతో జైరామ్ భట్ బోధిస్తారని లీలా తలస్సా అనే వ్యక్తి
9662890247 నంబర్ ద్వారా మోసగిస్తున్నారు.సుజల్ పటేల్, నవదీప్ బజ్వా అనే వ్యక్తులు “డ్యామ్ ట్రేడ్ క్యాపిటల్” (DAM Trade Capital) అనే సంస్థతో అనుబంధం ఉన్నట్లు 7054874084, 9967603975 నంబర్ల ద్వారా మోసగిస్తున్నారు.
“సుప్రీమస్ ఏంజెల్” (Supremus Angel) అనే సంస్థకు సంబంధించిన వాళ్లమంటూ జిగ్నేష్ , “ఎక్స్‌నెస్ బ్రోకర్” (Exnes Broker) అనే సంస్థ చెందిన వ్యక్తలమంటూ తేజస్ పటేల్, జగదీష్ అనే వ్యక్తులు 8780321223, 9375033033 నంబర్ల ద్వారా ఇన్వెస్టర్లను సంప్రదిస్తున్నారు.
పైన పేర్కొన్న వ్యక్తులు, సంస్థలు, మొబైల్ నంబర్ల నుంచి ఫోన్ చేసి స్టాక్ మార్కెట్లో ఖచ్చితమైన రాబడులు అందిస్తామని వాగ్దానం చేసి తమ ఇన్వెస్ట్‌మెంట్ పథకాలకు సభ్యత్వాన్ని పొందాలని కోరితే స్పందించవద్దని ఎన్‌ఎస్‌ఈ సూచించింది. ఇటువంటి వాగ్దానాలు చేయటం చట్ట ప్రకారం నిషేధమని స్టాక్ ఎక్స్ఛేంజీ స్పష్టం చేసింది. తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వంటి ట్రేడింగ్ ఖాతా వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని సూచించింది. ఇలా ఎవరైనా వ్యక్తులు, సంస్థలు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ రిజిస్టర్డ్ మెంబర్‌గా పేర్కొంటే తమ వెబ్‌సైట్‌లో https://www.nseindia.com/invest/find-a-stock-broker లింక్ ద్వారా ధ్రువీకరించుకోవచ్చని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment