నేషనల్ పెన్షన్ స్కీమ్: నేరుగా జమ చేస్తే కమీషన్‌

NPS account: PoPs to get up to Rs 15k commission check details - Sakshi

త్వరలో ఎన్‌పీఎస్‌ పీవోపీలకు కమీషన్‌ 

న్యూఢిల్లీ: జాతీయ పింఛను పథకం (నేషనల్ పెన్షన్ స్కీమ్-ఎన్‌పీఎస్‌) పరిధిలోని సభ్యులు తమ స్వచ్ఛంద పింఛను జమలకు డైరెక్ట్‌ రెమిట్‌ (నేరుగా జమ) మార్గాన్ని ఎంపిక చేసుకుంటే, పీవోపీలకు వచ్చే నెల నుంచి రూ.15-10,000 వరకు కమీషన్‌ లభిస్తుందని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) ప్రకటించింది.

పీఎఫ్‌ఆర్‌డీఏ కొత్త  నిబంధన కింద ఎన్‌పీఎస్‌ చందాదారులు నేరుగా జమ మార్గాన్ని ఎంపిక చేసుకోవడం వల్ల ఫీజుల రూపంలో నష్టపోయే పాయింట్‌ ఆఫ్‌ ప్రెజెన్స్‌ (పీవోపీలు) సంస్థలకు పరిహారాన్ని ఇవ్వడమే దీని లక్ష్యమని పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్పొరేట్ రంగం, అటల్ పెన్షన్ యోజన  పౌరులు ఎన్‌పీఎస్‌ చందాదారులుగా ఉంటారు.  అయితే ఎన్‌పీఎస్‌కు, చందాదారులకు మధ్య అనుసంధానకర్తలను పీవోపీలుగా పేర్కొంటారు. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, ఫిన్‌టెక్‌ కంపెనీలు పీవోపీల కిందకు వస్తాయి. ఎన్‌పీఎస్‌ ఖాతాలను తీసుకొచ్చేందుకు ఎంతగానో కృషి చేస్తున్న పీవోపీలకు తమ నిర్ణయం మద్దతుగా నిలుస్తుందని పీఎఫ్‌ఆర్‌డీఏ పేర్కొంది.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top