బడ్జెట్ లో నోకియా సీ1 ప్లస్ మొబైల్ | Nokia C1 Plus Launched Globally With Android Go | Sakshi
Sakshi News home page

బడ్జెట్ లో నోకియా సీ1 ప్లస్ మొబైల్

Dec 15 2020 2:13 PM | Updated on Dec 15 2020 2:26 PM

Nokia C1 Plus Launched Globally With Android Go - Sakshi

నోకియా సీ1 ప్లస్ ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌ను యూరోపియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఇది ఆండ్రాయిడ్ గో ఆపరేటింగ్ సిస్టమ్ మీద పనిచేయనుంది. దింట్లో 4జీ కనెక్టివిటీ కూడా అందించారు. యూరోప్ లో దీని ధర 69 యూరోలు(సుమారు 6,200). ఇది ఎరుపు, నీలం రంగులలో లభించనుంది.(చదవండి: డిసెంబర్ 29న రానున్న ఎంఐ 11)

నోకియా సీ1 ప్లస్ ఫీచర్స్ 

ఆండ్రాయిడ్ 10(గో ఎడిషన్)పై నడుస్తున్న నోకియా సీ1 ప్లస్ స్మార్ట్‌ఫోన్ 5.45-అంగుళాల హెచ్‌డి స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది 18:9 డిస్ప్లే రేషియోతో వస్తుంది. నోకియా C1 ప్లస్ స్మార్ట్ఫోన్ 1.4గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ మీడియా టెక్ ప్రాసెసర్ తో నడుస్తుంది. ఇందులో 1జీబీ ర్యామ్, 16జీబీ ఇంటర్నల్ స్టోరేజీని అందిస్తుంది. మైక్రో ఎస్ డీ కార్డ్ ద్వారా 128జీబీ స్టోరేజీ వరకు పెంచుకోవచ్చు. నోకియా సి 1 ప్లస్ లో సెల్ఫీ, వీడియోల కోసం ముందు, వెనుక భాగంలో 5మెగాపిక్సల్ ఒకే కెమెరాను అందించారు. 2500 ఎంఏహెచ్ బ్యాటరీతో సపోర్ట్ తో వస్తున్న నోకియా సి1 ప్లస్ లో 4జీ, వైఫై, బ్లూటూత్ 4.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్‌ను కలిగి ఉంది. 5వాట్ చార్జింగ్‌కి ఇది సపోర్ట్ చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలెరోమీటర్ (జి-సెన్సార్)ను అందిస్తుంది. ఇందులో ఎఫ్ఎం రేడియోను కూడా అందించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement