డిసెంబర్ 29న రానున్న ఎంఐ 11

Xiaomi Mi 11 Tipped to Launch on December 29 - Sakshi

తాజాగా వచ్చిన నివేదిక ప్రకారం, షియోమీ ఎంఐ 11 మొబైల్ ని డిసెంబర్ 29న లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ఎంఐ 11 సరికొత్త క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో పనిచేస్తుందని షియోమి సహ వ్యవస్థాపకుడు, సిఇఒ లీ జూన్ ఇప్పటికే ధృవీకరించారు. వీబోలో రెడ్‌మి ప్రొడక్ట్ డైరెక్టర్ వాంగ్ టెంగ్ థామస్ వెల్లడించిన కెమెరా శాంపిల్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. ఈ నెల చివర్లో ఎంఐ 11 ప్రారంభించనున్నట్లు గిజ్మో చైనా వెబ్ సైట్ షేర్ చేసిన నివేదిక ద్వారా తెలుస్తుంది. ఎంఐ 11 సిరీస్ మోడళ్లను మొదట చైనాలో లాంచ్ చేస్తారా లేదా ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేస్తారా అనే విషయంపై ఇప్పటి వరకు స్పష్టతలేదు.(చదవండి: ఐఫోన్13లో టచ్‌ఐడీ ఫింగర్ ప్రింట్ స్కానర్)

ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం ఎంఐ 11 మొబైల్ లో 55వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని తీసుకురానున్నారు. అలాగే, సెల్ఫీ కోసం పంచ్ హోల్ కెమెరా తీసుకురానున్నారు. వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉండనుంది. లీకైన ఫోటోల ప్రకారం.. మొబైల్ నీలం, వైట్ గ్రేడియంట్ కలర్ వేరియంట్లలో లభించనుంది. ఎంఐ 11లో వెనుక కెమెరాలో పెద్ద మార్పులు చేసినట్లు తెలుస్తుంది. ఇందులో రెండు పెద్ద కెమెరా టెలిఫోటో కెమెరా సెన్సార్లు, మూడవ కెమెరా మాక్రో కెమెరాతో రావచ్చు. ఈ మొబైల్ లో 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో QHD ప్లస్ ఏఎంఓఎల్ఈఢీ డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇప్పటికే మీ 10టీ ప్రోలో 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను తీసుకొచ్చారు. ఊహాగానాల ప్రకారం ఎంఐ 11 ధర 3,999 యువాన్లు(సుమారు రూ.44,984) నుండి 4,499యువాన్ల(రూ.50,610) మధ్య ఉండనుంది. అయితే ప్రో వెర్షన్ మాత్రం ర్యామ్, స్టోరేజ్ బట్టి 5,299 యువాన్ల నుండి 5,499 యువాన్ల మధ్య ఉండనుంది. 

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top