Aadhar Link: టెక్నికల్‌ ఇష్యూస్‌పై యూఐడీఏఐ క్లారిటీ.. తుది తేదీలు ఇవే!

No Technical Issues In Pan EPFO Aadhar Link Says UIDAI - Sakshi

పాన్‌ కార్డు, ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (ఈపీఎఫ్‌వో) అకౌంట్‌లతో ఆధార్‌ కార్డు లింక్‌ చేసే వ్యవహారంలో తీవ్ర గందరగోళం నెలకొంటోంది. చివరి తేదీలు ఎప్పుడు?, టెక్నికల్‌ ఇష్యూస్‌ తదితరాలపై రకరకాల కథనాలతో స్పష్టత లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 

యూఐడీఏఐ సిస్టమ్‌లో సమస్యలు తలెత్తుతున్నాయన్న మీడియా కథనాలపై Unique Identification Authority of India (UIDAI) స్పందించింది. ఎలాంటి టెక్నికల్‌ ఇష్యూస్‌ లేవని శనివారం ఒక ప్రకటన ద్వారా తేల్చి చెప్పింది. ఆధార్‌ లింక్‌కు తేదీలు దగ్గర పడుతుండడంతో సాంకేతిక సమస్యలుంటున్నాయని కొన్ని మీడియా హౌజ్‌లలో కథనాలు రావడం జనాల్లో గందరగోళానికి గురి చేస్తున్నాయని, ఈ నేపథ్యంలోనే తాము స్పందించాల్సి వచ్చిందని యూఐడీఏఐ స్పష్టం చేసింది.    

ఎన్‌రోల్‌మెంట్‌​, మొబైల్‌ నెంబర్‌ అప్‌డేట్‌​ సర్వీసుల్లో మాత్రం కొంత అసౌకర్యం కలిగిందన్న మాట వాస్తవమేనని, ఇప్పుడు ఆ సమస్య పరిష్కారం అయ్యిందని తెలిపింది. వీటికి పాన్‌ కార్డు, పీఎఫ్‌ అకౌంట్‌లకు ఆధార్‌ లింక్‌కు ఎలాంటి సంబంధం లేదని, లింక్‌ అప్‌గ్రేడేషన్‌ కొనసాగుతోందని పేర్కొంది. రోజుకు ఐదు లక్షల మందికి పైగా.. గత తొమ్మిది రోజుల్లో యాభై లక్షల మందికి పైగా అప్‌గ్రేడేషన్‌ చేసుకున్నారని యూఏడీఐఏ పేర్కొంది. 

ఇదిలా ఉంటే యూపీఎఫ్‌వో అకౌంట్‌తో ఆధార్‌ కార్డు లింక్‌కు తుది తేదీ సెప్టెంబర్‌ 1 కాగా, పాన్‌ కార్డుతో మాత్రం సెప్టెంబర్‌ 30 వరకు గడువు ఉంది.  ఈపీఎఫ్ కొత్త నిబంధనల ప్రకారం కచ్చితంగా పీఎఫ్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే పీఎఫ్ లో సంస్థ జమ చేసే నగదు మొత్తంపై ప్రభావం పడనుంది. 

క్లిక్‌ చేయండి: ఈపీఎఫ్‌ - ఆధార్‌ లింకు విధానం ఇలా..

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top