EPFO Aadhaar Link: ఇంకా పది రోజులే గడువు! | Link Aadhaar with EPF Account Before September 1 | Sakshi
Sakshi News home page

EPFO Aadhaar Link: ఇంకా పది రోజులే గడువు!

Aug 20 2021 8:22 PM | Updated on Aug 20 2021 8:23 PM

Link Aadhaar with EPF Account Before September 1 - Sakshi

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) చందాదారులు తమ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలను సెప్టెంబర్ 1 లోపు ఆధార్ తో లింక్ చేసుకోవాలని పేర్కొంది. గతంలో జూన్ 1 వరకు ఉన్న ఆధార్ - పీఎఫ్ యూఎన్ నెంబర్ లింకు గడువును సెప్టెంబర్ 1 వరకు పొడగిస్తూ ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు మీ పీఎఫ్ ఖాతా యూఎన్ నెంబర్‌ను ఆధార్‌తో లింకు చేయకపోతే వెంటనే లింకు చేసేయండి. ఈపీఎఫ్ కొత్త నిబంధనల ప్రకారం కచ్చితంగా పీఎఫ్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే పీఎఫ్ లో సంస్థ జమ చేసే నగదు మొత్తంపై ప్రభావం పడనుంది. 

ఒకవేళ ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతా ఆధార్‌తో లింకు చేసుకోకపోతే యజమాని జమ చేసే నగదు మీ ఖాతాలో ఇక నుంచి జమకాదు. కాబట్టి, మీ పీఎఫ్ ఖాతాను వెంటనే ఆధార్‌తో లింకు చేయాలని తెలుసుకోండి. దీనికి సంబంధించి ఉత్తర్వులను ఈపీఎఫ్ఓ విడుదల చేసింది. సామాజిక భద్రత కోడ్ 2020లోని సెక్షన్ 142 కింద ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకుంది. ఆధార్‌తో ఈపీఎఫ్‌ ఎలా లింకు చేయాలో ఈ క్రింది విదంగా తెలుసుకోండి.(చదువుకోండి: హోండా యు-గో ఎలక్ట్రిక్ స్కూటర్ ధర ఎంతో తెలుసా?)

ఈపీఎఫ్‌ - ఆధార్‌ లింకు విధానం 

  • అధికారిక ఈపీఎఫ్ఓ ​​వెబ్‌సైట్ ఓపెన్ చేసి లాగిన్ అవ్వండి.
  • ఇప్పుడు మేనేజ్ ట్యాబ్ కింద ఉన్న ఈ-కెవైసీ ఆప్షన్ ఎంచుకోండి.
  • 'ఆధార్' అని పేర్కొన్న ట్యాబ్ ఆప్షన్ ఎంచుకోండి
  • మీ పేరు, ఆధార్ కార్డు నెంబరును సరిగ్గా నమోదు చేసి 'సేవ్' మీద క్లిక్ చేయండి.
  • దీని తర్వాత, మీ ఆధార్ నెంబరు యుఐడీఎఐ డేటాబేస్ తో వెరిఫై అవుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement