డెట్‌ మ్యూచువల్‌ ఫండ్‌ మదుపర్లకు షాక్‌!

No Ltcg Tax Benefit On These Debt Mutual Funds From April 1 - Sakshi

డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ (Debt Mutual Funds) మదుపర్లకు కేంద్రం భారీ షాకిచ్చింది. ఆర్థిక బిల్లు 2023 సవరణల్లో భాగంగా లాంగ్‌ టర్మ్‌ కేపిటల్‌ గెయిన్స్‌ (ltcg) ప్రయోజనాన్ని ఎత్తివేసింది. దీంతో డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌పై పెట్టుబడి పెట్టగా వచ్చే రాబడిపై ట్యాక్స్‌ చెల్లించాల్సి ఉంటుంది. 

కనీసం 35 శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేయని డెట్‌ మ్యూచువల్‌ ఫండ్లకు ఇకపై ఎల్‌టీసీజీ ప్రయోజనం ఉండదు. ప్రస్తుతం డెట్‌ మ్యూచువల్‌ ఫండ్లలో మూడేళ్ల కంటే ఎక్కువ కాలం మదుపు చేస్తే వాటిని దీర్ఘకాల పెట్టుబడిగా పరిగణిస్తున్నారు.

ఈ ఫండ్స్‌లో పెట్టుబ‌డుల‌పై ఇండికేష‌న్‌తోపాటు 20 శాతం ఎల్‌టీసీజీ చెల్లించాలి. ఇండికేష‌న్ లేకుండా అయితే 10 శాతం ప‌న్ను పే చేస్తే స‌రిపోతుంది. కానీ ఇక నుంచి ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట‌ర్లంతా త‌మ‌కు వ‌చ్చే ఆదాయంపై ఇన్‌కం టాక్స్ శ్లాబ్ ఆధారంగా ప‌న్ను పే చేయాల్సిందే. దీనివ‌ల్ల ఈక్విటీ మార్కెట్ లింక్డ్ డిబెంచ‌ర్లు, డెట్ మ్యూచువ‌ల్ ఫండ్స్‌పై విధించే ప‌న్నులు స‌మానం అవుతాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top