ఆన్‌లైన్ బెట్టింగ్ యాడ్స్‌పై నిషేధం: కేంద్రం కన్నెర్ర.. తీవ్ర హెచ్చరికలు!

No Ads Promoting Online Betting Said I And B Ministry Issues Advisory - Sakshi

Online Betting Ads: మీడియా సంస్థలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. మీడియా ఫ్లాట్‌ ఫామ్‌లలో బెట్టింగ్‌ తరహా యాడ్స్‌ ను ప్రసారం చేయడం నిలిపివేయాలని యూనియన్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ మినిస్టీ వార్నింగ్‌ ఇచ్చింది. 

మనదేశంలో బెట్టింగ్‌, గ్యాబ్లింగ్‌లు చట్టరిత్యా నేరం. అయితే వాటిని ప్రోత్సహించడం వల్ల యువత తప్పుదారి పట్టడమే కాకుండా, సామాజిక ఆర్థిక ప్రమాదాలు తలెత్తే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని కేంద్ర ఐ అండ్‌ మినిస్ట్రీ అడ్వైజరీ తెలిపింది. అందుకే ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా, సోషల్‌ మీడియా అండ్‌ ఆన్‌లైన్‌ మీడియా సంస్థలు సంబధిత యాడ్స్‌ను ప్రసారం చేయకూడదని స్పష్టం చేసింది. అంతేకాదు థర్డ్‌ పార్టీ ఆన్‌లైన్‌ అడ్వటైజ్మెంట్‌ సంస్థలు, పబ్లిషర్లు బెట్టింగ్‌, గ్యాబ్లింగ్‌ యాడ్స్‌తో ఇండియన్‌ యూజర్లను టార్గెట్‌ చేయడం నిలిపివేయాలని విడుదల చేసిన రిపోర్ట్‌లో తెలిపింది. 

2025 నాటికి మార్కెట్‌ ఎంతంటే!
ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్‌,ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఫ్యాంటసీ స్పోర్ట్స్‌ (ఎఫ్‌ఐఎఫ్‌ఎస్‌) ప్రకారం..38శాతం వార్షిక వృద్ధితో 2025నాటికి ఈ ఫ్యాంటసీ స్పోర్ట్స్‌ మార్కెట్‌ విలువ రూ.1.5లక్షల కోట్లుగా ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. కేంద్రం తాజా నిర్ణయం త్వరలో పూర్తి స్థాయిలో అమలు కానుంది. దీంతో   4.5 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ను శాసిస్తున్న ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ను ప్రమోట్‌ చేసే ఫ్యాంటసీ స్పోర్ట్స్‌ కంపెనీలకు భారీ నష్టం చేకూరనున్నట్లు మార్కెట్‌ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top