
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు మదుపరులకు చుక్కలు చూపిస్తున్నాయి. నిన్ననే లాభాల్లోకి వెళ్లిన మార్కెట్ నేడు మళ్లీ భారీ నష్టాల్లోకి జారుకుంది. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్ మధ్యాహ్నం వరకు అదే ఊపు కొనసాగించింది. కానీ, ఇంట్రాడే గరిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో సూచీలు కిందకు వచ్చాయి. ముఖ్యంగా రిలయన్స్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ, టైటన్ వంటి దిగ్గజ షేర్లు కుంగడం సూచీల సెంటిమెంటును దెబ్బతీసింది.
చివరలో, సెన్సెక్స్ 323.34 పాయింట్లు (0.55%) క్షీణించి 58,340.99 వద్ద ఉంటే, నిఫ్టీ 88.30 పాయింట్లు (0.50%) క్షీణించి 17,415 వద్ద ముగిసింది. నిఫ్టీలో టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఐచర్ మోటార్స్, ఇన్ఫోసిస్, మారుతి సుజుకి, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ షేర్లు భారీ లాభాలను పొందితే.. ఒఎన్‌జిసి, అదానీ పోర్ట్స్, కోల్ ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంక్, బీపీసీఎల్ షేర్లు భారీగా నష్టపోయాయి.. ఆటో, ఐటీ, ఎఫ్ఎంసీజీ సూచీలు ఒక్కొక్కటి 1 శాతం పడిపోయాయి, చమురు, గ్యాస్, బ్యాంకింగ్ పేర్లలో కొనుగోలు కనిపించింది.