తొమ్మిదినెలల తరువాత 18వేల స్థాయికి నిఫ్టీ, అన్ని రంగాల్లోనూ లాభాలే! 

Nifty above 18k Sensex gains 463 pts all sectors in the green - Sakshi

61100  ఎగువకు సెన్సెక్స్‌

లాభాలతో కళకళలాడిన  దలాల్ స్ట్రీట్

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాల్లో ముగిసాయి. వారంతంలో కీలక సూచీలు రెండూ పాజిటివ్‌ నోట్‌తో ముగిసాయి. ఆరంభంలో స్వల్ప లాభాలతో  ఊగిసలాడినప్పటికీ, కంపెనీ ఫలితల జోష్‌తో సెన్సెక్స్‌ 463 పాయింట్లు ఎగిసి 61112 వద్ద ముగియగా, నిఫ్టీ 150 పాయింట్ల లాభంతో 18065 వద్ద స్థిరపడింది. తద్వారా నిఫ్టీ 18000 స్థాయిని అధిగమించింది. సెన్సెక్స్‌ 61100 వేల స్థాయికి పైన స్థిరపడింది.  గత తొమ్మినెలల కాలంలో ఇదే అదిపెద్ద లాభం. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి.
 
ప్రధానంగా అదానీ ట్విన్స్‌ అదానీ పోర్ట్స్‌, ఎంటర్‌ప్రైజెస్‌ భారీగా లాభపడ్డాయి. ఇంకా బ్రిటానియా, నెస్లే, విప్రో ఇతర టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. మరోవైపు యాక్సిస్‌ బ్యాంకు, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, టైటన్‌, హెచ్‌సీఎల్‌, ఓఎన్‌జీసీ నష్టపోయాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top