సింగిల్ చార్జ్ తో 100 కి.మీ ప్రయాణించే సైకిల్ | Nexzu Mobility Roadlark electric cycle with 100km range | Sakshi
Sakshi News home page

సింగిల్ చార్జ్ తో 100 కి.మీ ప్రయాణించే సైకిల్

Apr 20 2021 2:24 PM | Updated on Apr 20 2021 2:29 PM

Nexzu Mobility Roadlark electric cycle with 100km range - Sakshi

ఎలక్ట్రిక్ వాహన తయారీలో ఉన్న నెక్స్‌జూ మొబిలిటీ రోడ్‌లార్క్‌ పేరుతో సూపర్‌ లాంగ్‌ రేంజ్‌ ఈ-సైకిల్‌ను తయారు చేసింది. ఒకసారి చార్జింగ్‌ చేస్తే 100 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఈ స్థాయిలో నడిచే ఈ-సైకిల్‌ భారత్‌లో ఇదే తొలిసారి అని కంపెనీ తెలిపింది. ధర రూ.42,000. మూడు నాలుగు గంటల్లో చార్జింగ్‌ పూర్తి అవుతుంది. ఆరు రకాల రైడింగ్‌ మోడ్స్‌, డ్యూయల్‌ డిస్క్‌ ఎలక్ట్రిక్‌ బ్రేక్స్‌, డ్యూయల్‌ లిథియం అయాన్‌ బ్యాటరీ సిస్టమ్‌, 26 అంగుళాల కాటన్‌ ట్యూబ్‌ టైర్స్‌ ఏర్పాటు ఉంది. కోల్డ్‌ రోల్డ్‌ స్టీల్‌తో తయారైంది. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో పరుగెడుతుంది. ఇది నాలుగు రంగుల్లో లభిస్తుంది. నెక్స్‌జూ పోర్టల్‌ ద్వారాగాన్నీ దేశవ్యాప్తంగా ఉన్న 90 టచ్‌ పాయింట్లలో రోడ్‌లార్క్‌ను కొనుగోలు చేయవచ్చు.

చదవండి: 

టెకీల‌కు గుడ్ న్యూస్.. భారీగా నియామ‌కాలు!

Advertisement
 
Advertisement
Advertisement