ఆ దేశం వెళ్లాలంటే ఇక కష్టమే.. వీసా నిబంధనల్లో భారీ మార్పులు | Sakshi
Sakshi News home page

ఆ దేశం వెళ్లాలంటే ఇక కష్టమే.. వీసా నిబంధనల్లో భారీ మార్పులు

Published Sun, Apr 7 2024 6:22 PM

New Zealand Tightens Work Visas - Sakshi

వెల్లింగ్టన్ : మీరు ఆ దేశానికి వెళ్లేందుకు, అక్కడ పనిచేసేందుకు మక్కువ చూపుతున్నారా? ఇందుకోసం వీసాకి అప్లయి చేస్తున్నారా? అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆ దేశానికి వెళ్లడం కొంచెం కష్టంతో కూడుకున్న పనేనని విసా నిపుణులు చెబుతున్నారు.  

ఉద్యోగాలు, చదువు అనేది సగటు మధ్యతరగతి కుటుంబాల నుంచి ఉన్నత వర్గాల వారి వరకూ విదేశం అనేది ఓ కల. అందుకే దేశీయంగా ఆదరణ, అవకాశాలు ఎక్కువగా ఉన్న కోర్స్‌లు చదివి విదేశాలకు క్యూకడుతుంటారు. దీనికి తోడు ఆయా దేశాల అభివృద్దిలో భాగం చేసేందుకు వీసా మంజూరులో మార్పులు, చేర్పులు చేస్తున్నాయి. వలసదారుల్ని ప్రోత్సహిస్తున్నాయి. 

ఈ తరుణంలో న్యూజిలాండ్‌ ఎంప్లాయింటెంట్‌ వీసా ప్రోగ్రాంలో భారీగా మార్పులు చేసింది. గత ఏడాది రికార్డ్‌ స్థాయిలో విదేశీయులు తమ దేశానికి వలదారులు భారీ ఎత్తున క్యూ కట్టారని, దీంతో విసాలో మార్పులు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.  

 • చాలా తక్కువ నైపుణ్యం కలిగిన ఉ‍ద్యోగాల్లో పనిచేసే వారికి న్యూజిలాండ్‌లో వసతి ఐదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గించింది.
   
 • న్యూజిలాండ్‌ వీసాలో చేసిన కీలక మార్పులు
    
 • తక్కువ నైపుణ్యం కలిగిన లెవల్‌ 4, లెవల్‌ 5 కోసం ఉద్యోగాల్లో పనిచేసేందుకు మక్కువ చూపుతున్న వలసదారులకు ఇంగ్లీష్‌ తప్పని సరి చేసింది.
   
 • కనీస నైపుణ్యాలు వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌లో మార్పులు
   
 • లెవల్‌ 4, లెవల్‌ 5 వంటి లో స్కిల్డ్‌ ఉద్యోగాల్లో పనిచేసేందుకు ఆయా సంస్థలు సంబంధిత విభాగాల ఉద్యోగులకు వీసా ఇచ్చే విషయంలో వారి జీతాల్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. 
   
 • లెవల్‌ 4, లెవల్‌ 5 ఉద్యోగులకు న్యూజిలాండ్‌లో నివసించే కాలవ్యవధిని 5 నుంచి 3ఏళ్లకు తగ్గించింది.
   
 • ఫ్రాంఛైజీ అక్రిడిటేషన్‌ను రద్దు చేసింది. విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి సంస్థలు ప్రామాణిక, హైవ్యాల్యూమ్‌ ఉపాధి అక్రిడిటేషన్ ప్రక్రియలను అనుసరించాల్సి ఉంటుంది.

ఈ సందర్భంగా న్యూజిలాండ్‌లో నైపుణ్యం కొరత ఉన్న సెకండరీ టీచర్ల వంటి అత్యంత నైపుణ్యం కలిగిన వలసదారులను ఆకర్షించడం,నిలుపుకోవడంపై ప్రభుత్వం దృష్టి సారించింది’ అని ఇమ్మిగ్రేషన్ మంత్రి ఎరికా స్టాన్‌ఫోర్డ్ ఒక ప్రకటనలో తెలిపారు. అదే సమయంలో నైపుణ్యాల కొరత లేని ఉద్యోగాల కోసం న్యూజిలాండ్ వాసులు ముందు వరుసలో ఉండేలా చూసుకోవాలి అని ఆమె అన్నారు.

కాగా, గత సంవత్సరం, దాదాపు 173,000 మంది న్యూజిలాండ్‌కు వలస వెళ్ళారు. సుమారు 5.1 మిలియన్ల జనాభా ఉన్న న్యూజిలాండ్‌కు కోవిడ్‌ తగ్గుముఖం పెట్టిన తర్వాత విదేశీయుల తాకిడి ఎక్కువైంది. పొరుగున ఉన్న ఆస్ట్రేలియా కూడా వలసదారులు పెరిగారు. దీంతో రాబోయే రెండేళ్లలలో వలసదారుల్ని తగ్గించేందుకు సన్నాహకాలు ప్రారంభించినట్లు  తెలుస్తోంది.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement