కళ్లుచెదిరే లాభం.. కేవలం 5 నెలల్లో ఒక లక్షకు రూ. 85 లక్షల జాక్‌పాట్‌ కొట్టేశారు..!

This Multibagger Stock Gave a Whopping Return of More Than 8000 PC in Just 5 Months - Sakshi

స్టాక్‌ మార్కెట్స్‌ ఇది ఒక క్లిష్టమైన సబెక్ట్‌..! వీటిపై పట్టు సాధించాలనేగానీ..కుర్చున్న దగ్గర కాసుల వర్షం కురుస్తోంది. ఇక గత కొద్ది రోజులుగా స్టాక్‌ మార్కెట్స్‌లో మల్టీబ్యాగర్స్‌ స్టాక్స్‌ అంటూ వింటూనే ఉన్నాం. ఈ స్టాక్స్‌ ఇన్సెస్టర్లకు అతి తక్కువ కాలంలో ఎక్కువ మొత్తంలో భారీ లాభాలను అందిస్తోన్నాయి. కాగా తాజాగా ఎస్‌ఈఎల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ కంపెనీ లిమిటెడ్‌ ఇన్వెస్టర్లకు కనక వర్షాన్ని కురిపించాయి. 

ఐదునెలల్లో 8424 శాతం లాభాలు..!
SEL మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్ అనేది స్మాల్ క్యాప్ స్టాక్. గత కొన్ని నెలల్లో పెట్టుబడిదారులకు భారీ రాబడిని అందించిన పెన్నీ స్టాక్‌కు మంచి ఉదాహరణగా SEL మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్ నిలుస్తోంది. ఈ మల్టీ-బ్యాగర్ పెన్నీ స్టాక్ ధర రూ. 5.52 (నవంబర్ 1, 2021) ఉండగా ప్రస్తుతం ఒక్కో స్టాక్‌ ధర రూ.470.55కి పెరిగింది. ఈ కంపెనీలో ఇన్వెస్ట్‌ చేసిన వారికి గత 5 నెలల్లో 8424 శాతం కంటే ఎక్కువ రాబడిని అందించింది.  ఈ స్టాక్స్‌లో గత ఐదు నెలల్లో రూ. 1 లక్ష ఇన్వెస్ట్‌ చేసినవారికి రూ.85.24 లక్షల లాభాలను ఇన్వెస్టర్లకు తెచ్చి పెట్టింది.  ఈ మల్టీ బ్యాగర్‌ గత ఏడాది అక్టోబర్‌ నుంచి ఇన్వెస్టర్లకు భారీ లాభాలను అందించింది. 

ఆరంభంలో భారీ నష్టాలు..!
గతంలో SEL మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్ భారీ నష్టాలను కూడా మూటగట్టుకుంది. ఈ కంపెనీ ఒక్కో షేర్‌ ధర రూ. 215. 55 వద్ద  24 ఆగస్టు 2007 రోజున  బీఎస్‌ఈలో లిస్టింగ్‌ అయ్యింది. ఏడాది కంటే తక్కువ సమయంలోనే ఒక్కో షేర్‌ ధర రూ. 644.65కు చేరుకుంది. ఆ తరువాత కంపెనీ షేర్‌ ధర గణనీయంగా పడిపోయింది. ఒకానొక సమయంలో కంపెనీ షేర్‌ ధర రూ. 4.95 కు చేరుకుని భారీ నష్టాలను చవి చూసింది. ఈ స్టాక్‌ 2021 ఫిబ్రవరి నుంచి  పురోగమించి ఇప్పడు రికార్డు స్థాయిలో ఒక్కో షేర్‌ ధర రూ. 862.25కు చేరుకొని​ ఆల్‌టైం హై లాభాలను సొంతం చేసుకుంది. 

SEL మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్ అనేది దేశీయ టెక్స్‌టైల్ కంపెనీ . ఇది నూలు, బట్ట, రెడీమేడ్ వస్త్రాలు, తువ్వాళ్ల తయారీ, ప్రాసెసింగ్, వ్యాపారంలో నిమగ్నమై ఉంది. ఇది బీచ్ టవల్స్, బాత్ టవల్స్, కిచెన్ టవల్స్, క్రిస్మస్ టవల్స్ వంటి టెర్రీ టవల్స్ తయారు చేయడంతో ప్రసిద్ది చెందింది. 

చదవండి: కాసుల వర్షం కురిపిస్తోన్న హైదరాబాద్‌ కంపెనీ..! ఒక లక్షకు రూ. 3 కోట్ల లాభం..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top