కాసుల వర్షం కురిపిస్తోన్న హైదరాబాద్‌ కంపెనీ..! ఒక లక్షకు రూ. 3 కోట్ల లాభం..!

30500 PC Return in 8 Years Brokerages See Up to 60 Upside in This Multibagger - Sakshi

స్టాక్‌ మార్కెట్లు, మ్యూచువల్‌ ఫండ్స్‌, ఇవన్నీ సామాన్యులకు అర్థం కాని సబ్జెక్ట్‌. స్టాక్‌ మార్కెట్‌పై పట్టు సాధించాలేగానీ కాసుల వర్షానే కురిపిస్తాయి. కాగా తాజాగా హైదరాబాద్‌కు చెందిన క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థ తాన్లా ప్లాట్‌ఫామ్స్( Tanla Platforms) 8 ఏళ్లలో ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించింది. 

తాన్లా ప్లాట్‌ఫాం లిమిటెడ్‌ ఇన్వెస్టర్లకు భారీ లాభాలను అందజేస్తూ ఫేవరెట్‌ స్టాక్‌గా నిలిచింది. 2007 జనవరి 5న తాన్లా ప్లాట్‌ఫాం నేషనల్‌ స్టాక్‌ ఎక్సేఛేంజ్‌లో షేర్‌ ధర రూ. 189.93 వద్ద లిస్ట్‌ అయ్యింది. కంపెనీ ప్రారంభంలో భారీ నష్టాలను చవిచూసింది. ఒకానొక సమయంలో స్టాక్‌ ధర ఏకంగా రూ. 2 70కు పడిపోయింది. కాగా గత కొద్ది సంవత్సరాలుగా క్లౌడ్‌కంప్యూటింగ్‌కు భారీ ఆదరణ రావడంతో భారీగా పుంజుకుంది. 2014 మార్చి 28న కంపెనీ షేర్‌ ధర రూ.4.31గా ఉండగా...గత ఎనిమిదేళ్లలో ఈ కంపెనీ స్టాక్ 30,556 శాతం మేర లాభాలను ఇన్వెస్టర్లకు అందించింది. ప్రస్తుతం తాన్లా ప్లాట్‌ఫాం లిమిటెడ్‌ షేర్‌ ధర రూ. 1,440 గా ఉంది. ఈ కంపెనీలో లక్ష రూపాయలు ఇన్వెస్ట్‌ చేసిన వారికి  ప్రస్తుతం ఏకంగా రూ.3 కోట్లు లాభాలు వచ్చేవి. 

దూసుకుపోతున్న తాన్లా..
తాన్లా ప్లాట్‌ఫామ్స్ ప్రముఖ కమ్యూనికేషన్స్ ప్రొవైడర్. బిజినెస్ సంస్థలు తమ కస్టమర్లతో, స్టేక్‌హోల్డర్లతో సంప్రదింపులు జరుపుకునే సేవలను తాన్లా అందిస్తోంది. సీపాస్ స్పేస్‌లో ఉన్న మార్కెట్ లీడర్ కరిక్స్‌ను తాన్లా ప్లాట్‌ఫామ్స్ కొనుగోలు చేసింది. దాంతోపాటుగా మార్కెటింగ్ ఆటోమేషన్ కంపెనీ గమూగా‌ను సొంతం చేసుకుంది. ఇటీవలే ట్రూకాలర్‌తోనూ తాన్లా ప్లాట్‌ఫామ్స్ ఒప్పందం కుదుర్చుకుంది.

చదవండి: రూ. 1000 కోట్ల బోగస్‌ ఖర్చులు..పన్ను ఆదా కోసం తారుమారు లెక్కలు...!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top