ఫిట్‌గా ఉన్న ఉద్యోగులకు బంపర్‌ఆఫర్‌ ప్రకటించిన జెరోదా..!

A Month Salary As Bonus For Employees Meeting Health Goals At Zerodha - Sakshi

న్యూఢిల్లీ:  ప్రముఖ ఫైనాన్షియల్‌ బ్రోకరేజ్‌ సంస్థ జెరోదా తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఉద్యోగులు ఫిట్‌గా ఉండడం కోసం సరికోత్త ఛాలెంజ్‌ను కంపెనీ విసిరింది. ఛాలెంజ్‌లో భాగంగా ఏడాది కాలంలో లక్ష్యాన్ని చేరుకున్నఉద్యోగులకు  ఒక నెల జీతాన్ని బోనస్‌గా అందించనుంది. అంతేకాకుండా ఛాలెంజ్‌ను స్వీకరించిన వారిలో లక్కీ డ్రా ద్వారా ఎంపికైన ఒక ఉద్యోగికి రూ. 10 లక్షలను ఇవ్వనుంది. 

కోవిడ్‌-19 రాకతో చాలా మంది ఉద్యోగులు వర్క్‌ ఫ్రమ్‌ హోంకు పరిమితమవ్వడంతో వారి జీవన విధానంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. లాక్‌డౌన్‌ మొదలైనప్పటినుంచి ఉద్యోగులు ఇంటికే పరిమితమవ్వడంతో శారీరక శ్రమకు దూరంగా ఉన్నారని కంపెనీ సీఈవో నితిన్‌ కామత్‌ పేర్కొన్నారు. ఉద్యోగుల జీవన విధానంలో, ఆహార విషయంలో గణనీయమైన మార్పులు వచ్చినట్లు తెలిపారు.

ఫిట్‌గా ఉండేందుకు ఉద్యోగులకు ఈ ఛాలెంజ్‌ను విసిరినట్లు నితిన్‌ కామత్‌ వెల్లడించారు. కంపెనీ తీసుకొచ్చిన ఛాలెంజ్‌ ద్వారా ఉద్యోగుల జీవనా విధానంలో కచ్చితంగా మార్పులు వస్తాయని నితిన్‌ కామత్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఛాలెంజ్‌ను పూర్తి చేసిన ప్రతి ఉద్యోగికి ఒక నెల జీతం బోనస్‌, లక్కీ డ్రా ద్వారా ఎంపికైన ఒక ఉద్యోగికి రూ.10 లక్షలు అందిస్తామని నితిన్‌ ట్విటర్‌లో వెల్లడించారు.

చదవండి: 90 నిమిషాల్లో ఢిల్లీ టూ ముంబై

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top