కొలువుల కల్పనకు పరిశ్రమ దిగ్గజాల ప్రయత్నం
జాతీయ స్థాయిలో మిషన్ హండ్రెడ్ మిలియన్ జాబ్స్ ప్రారంభం
న్యూఢిల్లీ: దేశం వేగంగా వృద్ధి చెందుతున్నప్పటికీ ఉద్యోగాల కల్పనలో వెనుకబడుతున్న నేపథ్యంలో, దీన్ని పరిష్కరించేందుకు పరిశ్రమ దిగ్గజాలు నడుం కట్టారు. వచ్చే పదేళ్లలో పది కోట్ల ఉద్యోగాలను కల్పించే దిశగా మిషన్ హండ్రెడ్ మిలియన్ జాబ్స్‌ను ఆవిష్కరించారు. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణ మూర్తి, నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్, మెకిన్సే మాజీ సీనియర్ పార్ట్‌నర్ రజత్ గుప్తా, ఫ్రాక్టల్ సహ వ్యవస్థాపకుడు శ్రీకాంత్ వెలమకన్ని తదితరులు ఇందులో పాలుపంచుకుంటున్నారు.
ఎంట్రప్రెన్యూర్íÙప్‌ను ప్రోత్సహించేందుకు, స్థానిక ఎకానమీలను పటిష్టం చేసేందుకు, భారీ స్థాయిలో కొత్త నైపుణ్యాల్లో శిక్షణ కల్పించేందుకు ప్రభుత్వం, పరిశ్రమలు, పౌర సమాజంతో ఈ మిషన్ కలిసి పని చేస్తుంది. ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ సహ వ్యవస్థాపకుడు హరీష్ మెహతా, ది ఇండస్ ఎంట్రప్రెన్యూర్స్ (టై), సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్ పబ్లిక్ పాలసీ (సీఐపీపీ) వ్యవస్థాపకుడు కె. యతీష్ రజావత్ ఈ మేరకు ఒక ప్రకటన చేశారు.
దేశీయంగా ఉద్యోగం చేసే వయస్సు గల జనాభా సంఖ్య ఏటా 1.2 కోట్ల మేర పెరుగుతుండగా, భారీ స్థాయిలో ఉద్యోగాలు కల్పించడంలో ముందుండే తయారీ తదితర రంగాలు ఉపాధి కల్పనలో వెనుకబడుతున్నాయని పేర్కొన్నారు. కొత్తగా మార్కెట్లోకి వచ్చే వారికి ఉపాధి కల్పించేందుకు ఏటా 80–90 లక్షల ఉద్యోగాలను కల్పించాల్సిన పరిస్థితి ఉందని వివరించారు.
ఈ నేపథ్యంలోనే ఉద్యోగాల కల్పనను ఆర్ధికాభివృద్ధికి కీలక కొలమానంగా మార్చడంపై ఈ మిషన్ దృష్టి పెడుతుందని తెలిపారు. స్థూల దేశీయోత్పత్తిలో 30 శాతం వాటా ఉండే స్టార్టప్‌లు, చిన్న సంస్థలు అత్యధిక సంఖ్యలో ఉద్యోగాలు కలి్పస్తాయని, ఇవి పెద్ద నగరాలకే పరిమితం కాకుండా, చిన్న ప్రాంతాలకు కూడా విస్తరించేలా ప్రోత్సాహం కల్పించాల్సిన అవసరం ఉందని మెహతా వివరించారు. ఏటా 80–90 లక్షల ఉద్యోగాలు కల్పించే క్రమంలో అవరోధాలను తొలగిస్తే ఎంట్రప్రెన్యూర్íÙప్‌కి, పెద్ద ఎత్తున ఉద్యోగాలను కల్పించేందుకు ఊతం లభిస్తుందని పేర్కొన్నారు.


