IT Minister KTR Davos World Economic Forum 2023 Tour Success - Sakshi
Sakshi News home page

మంత్రి కేటీఆర్‌ దావోస్‌ పర్యటన విజయవంతం, రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు

Jan 21 2023 5:12 PM | Updated on Jan 21 2023 5:48 PM

Minister Ktr Davos World Economic Forum 2023 Tour Success - Sakshi

తెలంగాణ శాఖ మంత్రి కేటీఆర్ దావోస్ ప‌ర్య‌ట‌న ముగిసింది. ఈ సంద‌ర్భంగా ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ కృతజ్ఞతలు తెలుపుతూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. పెట్టుబ‌డులే ల‌క్ష్యంగా జ‌రిగిన వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ పర్యటన విజయవంతం అయినట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు. 4 రోజుల్లో 52 వాణిజ్య‌, 6 రౌండ్ టేబుల్ స‌మావేశాలు, 2 ప్యానెల్ చ‌ర్చ‌లతో తెలంగాణ‌కు రూ. 21 వేల కోట్ల పెట్టుబ‌డులు వ‌చ్చాయ‌ని కేటీఆర్ ప్ర‌క‌టించారు.

టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్ రూ. 16 వేల కోట్ల పెట్టుబ‌డితో హైద‌రాబాద్‌లో మ‌రో 3 డాటా సెంట‌ర్లు, గ్లోబ‌ల్ మ‌ల్టీ బ్రాండ్ రెస్టారెంట్ కంపెనీ ఇన్‌స్పైర్ బ్రాండ్స్ హైద‌రాబాద్‌లో త‌మ స‌పోర్ట్ సెంట‌ర్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన విష‌యం విదిత‌మే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement