మైండ్‌స్పేస్‌ చేతికి సస్టెయిన్‌ ప్రాపర్టీస్‌ | Mindspace REIT acquires 1. 8 million square feet property in Hyderabad | Sakshi
Sakshi News home page

మైండ్‌స్పేస్‌ చేతికి సస్టెయిన్‌ ప్రాపర్టీస్‌

Jan 30 2025 4:56 AM | Updated on Jan 30 2025 7:58 AM

Mindspace REIT acquires 1. 8 million square feet property in Hyderabad

హైదరాబాద్‌లో 18.2 లక్షల చదరపు అడుగుల ఆఫీస్‌ స్పేస్‌ 

సంస్థ విలువ రూ. 2,038 కోట్లు 

న్యూఢిల్లీ: మైండ్‌స్పేస్‌ బిజినెస్‌ పార్క్స్‌ రీట్‌  సస్టెయిన్‌ ప్రాపర్టీస్‌ను కొనుగోలు చేసింది. ఇందుకు సంబంధించి సంస్థ విలువను రూ. 2,038 కోట్లుగా లెక్కగట్టి ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఈక్విటీ వాటా కోసం రూ.613 కోట్లు చెల్లించనుండగా, రూ.1,400 కోట్ల రుణభారం మైండ్‌స్పేస్‌ రీట్‌కు బదిలీ అవుతుంది. ప్రతిగా సస్టెయిన్‌ ప్రాపర్టీస్‌ షేర్‌హోల్డర్లకు మైండ్‌స్పేస్‌ రీట్‌లో యూనిట్లు లభిస్తాయి. ఒక్కో యూ నిట్‌కు రూ. 379.08 రేటు చొప్పున 1,61,68,090 యూనిట్లను సస్టెయిన్‌ ప్రాపర్టీస్‌ షేర్‌హోల్డర్లకు జారీ చేసే ప్రతిపాదనకు మైండ్‌స్పేస్‌ రీట్‌ బోర్డు ఆమోదముద్ర వేసింది. 

మార్చి ఆఖరు నాటికి డీల్‌ ముగిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  ఈ డీల్‌తో సస్టెయిన్‌ ప్రాపర్టీస్‌కి హైదరాబాద్‌లో కామర్జ్‌వన్‌ రాయ్‌దుర్గ్‌ పేరిట ఉన్న 18.2 లక్షల చ.అ. ఆఫీస్‌ స్పేస్‌.. మైండ్‌స్పేస్‌ రీట్‌ చేతికి దక్కుతుంది. యూనిట్‌హోల్డర్లకు మరింత విలువ చేకూర్చేలా ఈ డీల్‌ ఒక మైలురాయిగా ఉంటుందని మైండ్‌స్పేస్‌ రీట్‌ సీఈవో రమేష్‌ నాయర్‌ తెలిపారు. ఆదాయాలు, కంపెనీ  పోర్ట్‌ఫోలియోలు మెరుగుపడేందుకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. కే రహేజా కార్పొరేషన్‌ గ్రూప్‌నకు చెందిన మైండ్‌స్పేస్‌ బిజినెస్‌ పార్క్స్‌ రీట్‌ 2020 ఆగస్టులో స్టాక్‌ ఎక్సే్చంజీల్లో లిస్టయ్యింది.
 

Advertisement
 
Advertisement
Advertisement