మైక్రోసాఫ్ట్‌లో 4,800 మంది ఉద్యోగుల తొలగింపు! | Microsoft Layoffs 2026, Announces 4,800 Job Cuts As AI Investments Surge Across Tech Industry | Sakshi
Sakshi News home page

మైక్రోసాఫ్ట్‌లో 4,800 మంది ఉద్యోగుల తొలగింపు!

Jul 6 2026 9:27 PM | Updated on Jul 7 2026 11:17 AM

microsoft layoffs 4800 employees ai costs

టెక్ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రేసు తీవ్రతరమవుతున్న వేళ ప్రముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గజం ‘మైక్రోసాఫ్ట్’ సంచలన నిర్ణయం తీసుకుంది. సంస్థ అంతటా సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంతో పాటు, ఏఐ మౌలిక సదుపాయాలపై భారీగా పెరుగుతున్న పెట్టుబడులను తట్టుకునేందుకు వీలుగా ఉద్యోగాల కోతకు శ్రీకారం చుట్టింది. తన మొత్తం శ్రామిక శక్తిలో 2.1 శాతం అంటే సుమారు 4,800 మంది ఉద్యోగులను విధుల్లోంచి తొలగిస్తున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది.

రూ.58 లక్షల కోట్లకు చేరిన ఏఐ ఖర్చులు

ప్రస్తుత ఏడాది ప్రపంచవ్యాప్తంగా టెక్ దిగ్గజాల ఏఐ వ్యయాలు ఏకంగా 700 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.58.8 లక్షల కోట్లు) చేరుకున్నాయి. అయితే, ఈ భారీ పెట్టుబడులకు తగ్గట్టుగా రాబడులను (ఆర్‌ఓఐ) చూపించాల్సిన ఒత్తిడి కంపెనీలపై తీవ్రంగా ఉంది. మరోవైపు, వ్యాపార సామర్థ్యాన్ని పెంచేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వాడుతుండటంతో మానవ వనరుల అవసరం తగ్గుతోంది. కేవలం మైక్రోసాఫ్ట్ మాత్రమే కాకుండా ఈ ఏడాది అమెజాన్, మెటా ప్లాట్‌ఫామ్స్ వంటి ఇతర బిగ్ టెక్ కంపెనీలు సైతం వేలాది మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి: వినియోగదారులను ముంచే ‘ఉత్తుత్తి’ ప్రకటనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement