ఇండియా కా నయా బ్లాక్‌బస్టర్‌ వచ్చేసింది

Micromax In 1 Launch With MediaTek Helio G80 Soc - Sakshi

న్యూఢిల్లీ: మైక్రోమాక్స్ తన ఇన్ 1 స్మార్ట్ ఫోన్ తాజాగా భారతదేశంలో లాంచ్ చేసింది. ఇందులో మెటాలిక్ ఫినిష్, వెనకవైపు ఎక్స్ ప్యాటర్న్ ఉంది. ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, సెల్ఫీ కెమెరా కోసం పంచ్-హోల్ కటౌట్ కలిగి ఉంది. మైక్రోమాక్స్ ఇన్ 1 మొబైల్ మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్ చేత పనిచేస్తుంది. ఇందులో రెండు ర్యామ్, స్టోరేజ్ వేరియంట్లు, కలర్ ఆప్షన్లు ఉన్నాయి. వెనుకవైపు ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. ఇన్ 1 ఫేస్ అన్‌లాక్‌కు మద్దతు ఇస్తుంది. మైక్రోమాక్స్ ఇన్ 1(ఫస్ట్ ఇంప్రెషన్స్) మార్చి 26న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్, మైక్రోమాక్స్ వెబ్‌సైట్ ద్వారా కొనుగోలుకు రానుంది. 

మైక్రోమ్యాక్స్ ఇన్ 1 ఫీచర్లు:

  • 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్ ప్లే
  • మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్‌
  • 4జీబీ, 6జీబీ ర్యామ్ వేరియంట్లు
  • 64జీబీ, 128జీబీ స్టోరేజ్ వేరియంట్లు
  • మైక్రో ఎస్‌డీ కార్డుతో 256జీబీ వరకు పెంచుకునే అవకాశం 
  • 48 ఎంపీ మెయిన్ కెమెరా, 2 ఎంపీ డెప్త్ సెన్సార్, 2 ఎంపీ మాక్రో సెన్సార్
  • 8 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టం
  • బ్యాటరీ సామర్థ్యం 5,000 ఎంఏహెచ్
  • 18వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ 
  • 4జీబీ + 64జీబీ వేరియంట్‌కు రూ.9,999
  • 6జీబీ + 128జీబీ వేరియంట్‌కు రూ.11,499

చదవండి:

జోరుగా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top