5జీ వచ్చేస్తుంది, ఏఏ నగరాల్లో ముందంటే? ఇదే లిస్టు!

May Get These 13 Cities 5G First in India - Sakshi

5జీ స్ప్రెక్టం వేలం కోసం కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. జులై 26న నిర్వహించే ఈ వేలంలో టెలింకా సంస్థలకు 72జీహెచ్‌జెడ్‌ 5జీ స్ప్రెక్టం బిడ్లను 20ఏళ్ల పాటు అప్పగించనుంది. దీంతో ఈ ఏడాదిలోపే 5జీ నెట్‌వర్క్‌లు అందుబాటులోకి రానున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అదే జరిగితే 4జీ కంటే 5జీ సేవల్ని 10రెట్ల వేగంతో వినియోగించుకోవచ్చు. 

5జీ నెట్‌ వర్క్‌ వినియోగం 
టెలికాం శాఖ 5జీ స్ప్రెక్టం వేలంలో లో(తక్కువ)లో  (600ఎంహెచ్‌జెడ్‌, 800 ఎంహెచ్‌జెడ్‌, 900 ఎంహెచ్‌జెడ్‌, 1800 ఎంహెచ్‌జెడ్‌, 2100 ఎంహెచ్‌జెడ్‌, 2300 ఎంహెచ్‌ జెడ్‌లు) ఉండగా మిడ్‌లో ( 3300ఎంహెచ్‌జెడ్‌) హైలో (26జీహెచ్‌జెడ్‌) ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్‌ ఉంటాయి. ఇక మనకు 5జీ సర్వీస్‌ అందుబాటులోకి రావాలంటే మిడ్‌, హై ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్‌ ఉంటే సరిపోతుంది. 

13 నగరాల్లో 5జీ స్ప్రెక్టం వేలం
జులై 26న తొలిదశలో 5జీ నెట్‌వర్క్‌ స్ప్రెక్టం వేలం 13 నగరాల్లో  జరగనుంది. వీటిలో అహ్మదాబాద్‌, బెంగళూరు, చండీఘడ్‌, చెన్నై, ఢిల్లీ, గాంధీ నగర్‌ (గుజరాత్‌), గురుగ్రామ్‌, హైదారబాద్‌, జామ్‌ నగర్‌,కోల్‌ కతా, లక్నో, ముంబై, పూణేలు ఉన్నాయి. అంటే ముందుగా ఏ నగరంలో స్ప్రెక్టం వేలం జరిగితే ఆ ప్రాంతంలో 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయి. 

5జీ రేసులో ఏఏ సంస్థలు ఉన్నాయంటే
ఇప్పటికే 5జీ సేవల్ని వినియోగదారుల్ని అందిస్తామంటూ టెలికాం సంస్థ  5జీ ట్రయల్స్‌ నిర్వహించాయి. వాటిలో ఎయిర్‌టెల్‌, జియో, వొడాఫోన్‌ ఐడియాలు ఉండగా.. ఏ సంస్థ 5జీ సర్వీసుల్ని అందుబాటులోకి తెస్తుందనేది తెలియాంటే మరికొంత కాలం వేచి చూడాల్సి ఉంటుంది.

చదవండి👉సంచలనం, భారత్‌లో ఎయిర్‌టెల్‌ 5జీ సేవలు..ఎప్పట్నుంచో తెలుసా!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top