యూట్యూబ్‌ చూసి.. దెబ్బకి సెలబ్రిటీ అయిపోయాడు!

 Maruti Suzuki Swift converted into a Lamborghini by a mechanic from Assam - Sakshi

అసోంకు చెందిన మెకానిక్‌ నూరుల్‌ హక్‌ ప్రతిభ

తన డ్రీం కార్‌ కోసం , సరికొత్త ప్రాజెక్ట్‌

 యూట్యూబ్‌లో వీడియోలు చూసి విడి భాగాలు

పాత స్విఫ్ట్‌ను  లంబోర్ఘినిగా తీర్చిదిద్దాడు

నెక్ట్స్‌ టార్టెట్‌ లగ్జరీ స్పోర్ట్స్ కారు ఫెరారీ అట!

యూట్యూబ్ వీడియోలనును ఖరీదైన అందులోనూ లాంబొర్గిని లాంటి విలాసవంతమైన స్పోర్ట్స్ కారును తయారుచేయడం సాధ్యమేనా? అంటే కృషి ఉంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించాడు అసోంకు చెందిన ఒక మెకానిక్. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా..సాధనమ్మున పనులు సమకూరును ధరణిలోన అన్నట్టు తాను అనుకున్నది సాధించి తీరాడు..తన డ్రీం కార్‌ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌  చేసి  ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయాడు. ఈ కారుతో సెల్ఫీలు తీసుకోవడానికి ఎగబడ్డారు.

అస్సాంలోని కరీమ్‌గంజ్ జిల్లాలోని భంగా ప్రాంతానికి చెందిన మోటారు మెకానిక్ నూరుల్ హక్ (30 )ఈ అద్భుతానికి శ్రీకారం చుట్టాడు. భంగా ఏరియాలో ఎన్ మారుతి కార్‌ కేర్‌ అనే గ్యారేజీ నిర్వహించే నూరుల్‌కు స్పోర్ట్స్‌ కార్లంటే మోజు. అందులోనూ లంబోర్ఝిని అంటే మరీ ప్రాణం. ఎలాగైనా  అలాంటి కారును నడపాలని, సొంతం చేసుకోవాలని కలలుకన్నాడు. ఇంతలో కరోనా సంక్షోభం, లాక్‌డౌన్‌ ఇబ్బందులు వచ్చి పడ్డాయి. పని లేకుండా ఇంట్లో కూర్చోవలసి వచ్చింది. తన డ్రీంకార్‌ తయారీపై దృష్టిపెట్టాడు.ఎట్టకేలకు తనకున్న తక్కువ వనరులోనే స్విఫ్ట్ కారు ఇంజీన్‌ మార్చి తన సొంత వెర్షన్నుతయారు చేయాలని నిర్ణయించు కున్నాడు. ఎట్టకేలకు తన పాత స్విఫ్ట్‌కారును ఇటాలియన్ లగ్జరీ కారు లగ్జరీ కారు లంబోర్ఘిని మోడల్‌లో తీర్చి దిద్దాడు. ఎనిమిది నెలలపాటు శ్రమించి తన ప్రాజెక్టును పూర్తి చేశాడు. దీని కోసం .రూ.6.2 లక్షలు ఖర్చు చేశానని నూరుల్ చెప్పాడు.అంతేకాదు తన నెక్ట్స్‌ టార్టెట్‌ కార్‌ లగ్జరీ స్పోర్ట్స్ కారు ఫెరారీ అని  స్పష్టం చేశాడు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top