
ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ దసరా, దీపావళి పండుగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. అక్టోబర్ 31 వరకు కార్లపై డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా ఎస్‌యూవీ మోడల్ జిమ్నీపై రూ.లక్ష వరకు రాయితీని ఇస్తున్నట్టు ప్రకటించింది.
జిమ్నీ ఎస్‌యూవీపై రూ.50 వేల వరకు రాయితీ ఇస్తున్న సంస్థ..ఎక్సేంజ్ లేదా లాయల్టీ బోనస్ కింద రూ.50 వేల వరకు డిస్కౌంట్ ఇస్తున్నది. ఈ ఆఫర్ మాన్యువల్, పెట్రోల్ రకం మాడళ్లకు వర్తించనున్నది. ప్రస్తుతం జెటా రకం రూ.12.74 లక్షల ప్రారంభ ధరతో లభించనున్నది.