సులభంగా ఈపీఎఫ్‌వో క్లెయిమ్‌ల పరిష్కారం: మాండవీయ  | Mansukh Mandaviya tells EPFO to improve claim settlement, complaint system | Sakshi
Sakshi News home page

సులభంగా ఈపీఎఫ్‌వో క్లెయిమ్‌ల పరిష్కారం: మాండవీయ 

Jan 26 2025 4:51 AM | Updated on Jan 26 2025 4:51 AM

Mansukh Mandaviya tells EPFO to improve claim settlement, complaint system

న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి క్లెయిమ్‌ల పరిష్కారాన్ని మరింత సులభంగా మార్చాలంటూ అధికారులకు కేంద్ర మంత్రి మనుసుఖ్‌ మాండవీయ ఆదేశించారు. సకాలంలో ఫిర్యాదులకు పరిష్కారం చూపాలని, ప్రజలతో స్నేహపూర్వక విధానాన్ని అనుసరించాలని కోరారు. ఈపీఎఫ్‌వో ప్రాంతీయ అధికారుల పనితీరు సమీక్ష కోసం మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పై ఆదేశాలు జారీ చేశారు. 

క్లెయిమ్‌ దరఖాస్తు తిరస్కారాలను తగ్గించడం, పరిష్కార సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడం, యూనివర్సల్‌ అకౌంట్‌ నంబర్ల (యూఏఎన్‌) యాక్టివేషన్, అధిక వేతనాలపై పెన్షన్‌ అమలు ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్టు కార్మిక శాఖ ప్రకటించింది. సేవల మెరుగునకు తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా మంత్రికి అధికారులు వివరించారు. అధిక వేతనాలపై పింఛను, పిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి కోరారు. జోనల్, రీజినల్‌ కార్యాలయాలు సేవల పనితీరు మెరుగుపరుచుకోవాలని ఆదేశించారు.   
 

Advertisement
 
Advertisement
Advertisement