Mahindra Thar, XUV300 up to Rs 1 lakh discount, check details - Sakshi
Sakshi News home page

ఈ కార్లను కొనేవారు అదృష్టవంతులే..ఎందుకో ఇక్కడ చూడండి!

Dec 6 2022 4:30 PM | Updated on Dec 6 2022 5:52 PM

Mahindra Thar, Xuv300 Up To Rs 1 Lakh Discount - Sakshi

మహీంద్రా థార్‌! ఈ వెహికల్‌ బుకింగ్స్‌,సేల్స్‌ విషయంలో దేశీయ వాహనాల్లో మోస్ట్‌ పాపులర్‌ రోడ్‌ లైఫ్‌ స్టైల్‌ వెహికల్‌గా పేరు సంపాదించింది. క్రికెటర్ల నుంచి బాలీవుడ్‌ సెలబ్రిటీల వరకు కల్ట్‌ వెహికల్‌గా పేరొందిన థార్‌ వెహికల్‌పై ఆటోమొబైల్‌ మార్కెట్‌లో యమ క్రేజ్‌ ఉంది. ఆ క్రేజ్‌ దృష్ట్యా మహీంద్రా సంస్థ ట్రెండ్‌కు తగ్గట్లు లేటెస్ట్‌ టెక్నాలజీతో సొబుగులద్ది నయా లుక్‌తో కొనుగోలు దారులకు పరిచయం చేస్తోంది. 

అయితే డిసెంబర్‌లో ఆ కారు కొనేవారు అదృష్టవంతులేనని మహీంద్రా ప్రతినిధులు చెబుతున్నారు. ఎందుకంటే? మహీంద్రా థార్‌తో పాటు ఎక్స్‌యూవీ300 ఎస్‌యూవీ, స్కార్పియో క్లాసిక్‌, స్కార్పియో - ఎన్‌, ఎక్స్‌యూవీ 700 వెహికల్స్‌ను  భారీ డిస్కౌంట్లకే అందిస్తున్నట్లు తెలిపారు. 

మహీంద్రా థార్
థార్‌ లాంచ్‌ చేసిన ఆగస్ట్‌ 2020 నాటి నుంచి ఆ వెహికల్స్‌ సేల్స్‌ భారీ మొత్తం జరుగుతున్నట్లు మహీంద్రా ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పుడు అదే వెహికల్‌ డీజిల్‌, పెట్రోల్‌ వేరియంట్‌ పై రూ.20వేల వరకు డిస్కౌంట్‌ ఇస్తున్నట్లు వెల్లడించింది. 5డోర్లు థార్‌ ఎస్‌యూవీలో 2.2లీటర్ల mHawk డీజిల్‌ ఇంజిన్‌, 2.0 లీటర్ల mStallion పెట్రోల్‌ ఇంజిన్‌లతో మైలేజ్‌ అవుట్‌పుట్‌ బాగుటుంది. 

మహీంద్రా ఎక్స్‌యూవీ 300
మిడ్‌ పెట్రోల్‌ వేరియంట్‌ (w8) విభాగంలో వాహనదారుల్ని ఆకట్టుకుంటున్న మహీంద్రా ఎక్స్‌యూవీ 300  కారుపై రూ.లక్ష డిస్కౌంట్‌, అదే మిడ్‌ పెట్రోల్‌ వేరియంట్‌ డబ్ల్యూ6 పై రూ.80వేలు, డబ్ల్యూ8 వేరియంట్లపై రూ.90వేలు, డబ్ల్యూ 4 వేరియంట్‌పై రూ.53వేల వరకు డిస్కౌంట్‌తో సొంతం చేసుకోవచ్చు. 

మహీంద్రా ఎక్స్‌యూవీ 300 టర్బో స్పోర్ట్‌ 
అక్టోబర్‌ మహీంద్రా లాంచ్‌ చేసిన మహీంద్రా ఎక్స్‌యూవీ 300 టర్బో స్పోర్ట్‌ వెహికల్‌ ప్రారంభం ధర రూ.10.35లక్షలు ఉండగా..ఇప్పుడు అదే వెహికల్‌పై రూ.60వేల వరకు డిస్కౌంట్‌కే అందిస్తున్నట్లు మహీంద్రా యాజమాన్యం తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement