వంద శాతం రుణంతో మహీంద్రా సుప్రో ప్రాఫిట్‌ ట్రక్స్‌

Mahindra Supro Profit Truck Range Launch Price Five lakhs Onwards - Sakshi

Mahindra Supro Profit Truck  హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్‌ మహీంద్రా తాజాగా సుప్రో ప్రాఫిట్‌ ట్రక్‌ శ్రేణిని ప్రవేశపెట్టింది. ధర ముంబై ఎక్స్‌ షోరూంలో మినీ రూ.5.4 లక్షల నుంచి, మ్యాక్సీ రూ.6.22 లక్షల నుంచి ప్రారంభం. డీజిల్, సీఎన్‌జీ వేరియంట్లలో లభిస్తుంది.

సుప్రో ప్లాట్‌ఫాంపై ఇవి రూపొందాయి. కొనుగోలుదార్లు అయిదేళ్ల కాలపరిమితితో 100 శాతం వరకు రుణం తీసుకోవచ్చు. ‘సామర్థ్యం, ఇంజినీరింగ్‌ కారణంగా కస్టమర్లు ఇష్టపడే చిన్న వాణిజ్య వాహనంగా సుప్రోకు ప్రాధాన్యత ఉంది. వినియోగదార్ల లాభదాయకతను దృష్టిలో పెట్టుకుని నూతన శ్రేణిని అందుబాటులోకి తెచ్చాం’ అని కంపెనీ ఆటోమోటివ్‌ విభాగం సీఈవో విజయ్‌ నక్రా తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top