Anand Mahindra: మహీంద్రా ఫస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ ఇదే! మీకు తెలుసా?

Mahindra First Electric Vehicle Shares Anand Mahindra - Sakshi

మహీంద్రా అండ్ మహీంద్రా అధినేత 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే అప్పుడప్పుడు ఆసక్తికరమైన విషయాలను తన ట్విటర్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఈయన చేసిన మరో ఇంట్రస్టింగ్ పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

వరల్డ్ ఈవీ డే సందర్భంగా ఆనంద్ మహీంద్రా బిజిలీ (BIJLEE) అనే త్రీ వీలర్ వెహికల్ ఫోటోను X (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేసాడు. ఇందులో ఇది నన్ను గతంలోకి నడిపించింది. తన పదవి విరమణకు ముందు కంపెనీలో అనుభవజ్ఞుడైన నాగర్కర్ ఈ ఎలక్ట్రిక్ వెహికల్ రూపొందించాడని చెప్పుకొచ్చాడు.

నిజానికి మహీంద్రా కంపెనీ మొట్టమొదటి ఎలక్ట్రిక్ వెహికల్ ఈ 'బిజిలీ' (BIJLEE). 1999లో నాగర్కర్ రిటైర్మెంట్‌కి ముందు ఆయన మాకు అందించిన బహుమతి. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే వేలమంది లైక్ చేయగా, కొందరు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు.

ఇదీ చదవండి: జీ20 సమ్మిట్ కోసం భారత్ ఇన్ని కోట్లు ఖర్చు చేసిందా? ఆసక్తికర విషయాలు!

బిజిలీ ఈవీ మార్కెట్లో విక్రయానికి రానప్పటికీ.. ప్రస్తుతం మహీంద్రా XUV400 ఎలక్ట్రిక్ కారు ఈ విభాగంలో తిరుగులేని అమ్మకాలను పొందుతూ అత్యంత ప్రజాదరణ పొందుతోంది. కాగా కంపెనీ థార్ SUVని కూడా త్వరలో ఎలక్ట్రిక్ రూపంలో విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top