మహీంద్రా, బీఐఐ రూ.4,000 కోట్లు

Mahindra and British International Investment Commit Over Rs 4,000 Crore for Electric SUV - Sakshi

ఈవీ కో కంపెనీలో పెట్టుబడులు

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్‌ స్పోర్ట్స్‌ యుటిలిటీ వాహన విభా గం కోసం మహీంద్రా గ్రూప్, బ్రిటిష్‌ ఇంటర్నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌(బీఐఐ) రూ.4,000 కోట్లు పెట్టు బడి చేయాలని నిర్ణయించాయి. మహీంద్రా ఈవీ విభా గం అయిన ఈవీ కో కంపెనీలో బ్రిటిష్‌ ఇంటర్నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రూ.2,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్టు ఇప్పటికే ప్రకటించింది. ఇద్దరు భాగస్వాముల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ప్ర ణాళికాబద్ధమైన ఉత్పత్తులకు 2023–24 నుంచి 2026–27 మధ్య నూతన ఎలక్ట్రిక్‌ వాహన కంపెనీ మొత్తం రూ.8,000 కోట్ల మూలధనాన్ని కలిగి ఉంటుంది. వ్యాపారాన్ని పటిష్టం చేయడం కోసం ఈవీ కో కంపెనీలోకి మరింత మంది పెట్టుబడిదార్లను తీసుకు వస్తామని మహీంద్రా గ్రూప్‌ తెలిపింది.  

ఎలక్ట్రిక్‌ వాటా 25 శాతం..
ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ అయిన ఎక్స్‌యూవీ 400 మోడల్‌ను మహీంద్రా ఇటీవలే ఆవిష్కరించింది. అయిదు రకాల ఈ–ఎస్‌యూవీలను భారత్‌తోపాటు అంతర్జాతీయ మార్కెట్ల కోసం పరిచయం చేస్తామని యూకేలో జరిగిన ఓ కార్యక్రమంలో కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎక్స్‌యూవీతోపాటు బీఈ పేరుతో పూర్తి ఎలక్ట్రిక్‌ బ్రాండ్‌ శ్రేణి లో ఈ నూతన మోడళ్లను పరిచయం చేయనుంది. ఎలక్ట్రిక్‌ ప్యాసింజర్‌ కార్ల విభాగంలో కంపెనీ ఇప్పటి వరకు లేదు. అయితే ఎలక్ట్రిక్‌ త్రిచక్ర వాహ న విభాగంలో సంస్థకు ఏకంగా 70% వాటా ఉంది. 2027 నాటికి సంస్థ విక్రయించే అన్ని ఎస్‌యూవీల్లో ఎలక్ట్రిక్‌ వాటా 25% ఉంటుందని భావిస్తోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top