గ్రీన్‌ఫ్యూయల్‌ కొనుగోలు పూర్తి: లుమాక్స్‌ | Lumax Auto Technologies acquires 60pc stake in Greenfuel Energy Solutions | Sakshi
Sakshi News home page

గ్రీన్‌ఫ్యూయల్‌ కొనుగోలు పూర్తి: లుమాక్స్‌

Nov 28 2024 7:55 AM | Updated on Nov 28 2024 7:55 AM

Lumax Auto Technologies acquires 60pc stake in Greenfuel Energy Solutions

ముంబై: గ్రీన్‌ఫ్యూయల్‌ ఎనర్జీ సొల్యూషన్స్‌కు చెందిన ప్రత్యామ్నాయ ఇంధన బిజినెస్‌లో 60 శాతం వాటా కొనుగోలుని పూర్తి చేసినట్లు లుమాక్స్‌ రిసోర్స్‌ వెల్లడించింది. ఇందుకు రూ. 153 కోట్లకుపైగా వెచ్చించింది. నిధులను అంతర్గత వనరులు, రుణాల ద్వారా సమీకరించినట్లు కంపెనీ వెల్లడించింది.

ఆటోమోటివ్‌ సిస్టమ్స్, విడిభాగాల తయారీ దిగ్గజం లుమాక్స్‌ ఆటో టెక్నాలజీస్‌కు సొంత అనుబంధ కంపెనీ లుమాక్స్‌ రిసోర్స్‌. తాజా ఈ కొనుగోలు ద్వారా లుమాక్స్‌ ఆటో టెక్నాలజీస్‌ సీఎన్‌జీ, హైడ్రోజన్‌ తదితర గ్రీన్, ఆల్టర్నేట్‌ ఇంధన విభాగాలలోకి ప్రవేశించనుంది. వీటికి పటిష్ట డిమాండ్‌ కారణంగా రానున్న కాలంలో అత్యుత్తమ వృద్ధిని అందుకోనున్నట్లు కంపెనీ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement