ఎల్‌అండ్‌టీ నుంచి భారీ డివిడెండ్‌? | L&T may announce special dividend on Wednesday | Sakshi
Sakshi News home page

ఎల్‌అండ్‌టీ నుంచి భారీ డివిడెండ్‌?

Published Sat, Oct 24 2020 4:07 PM | Last Updated on Sat, Oct 24 2020 4:07 PM

L&T may announce special dividend on Wednesday - Sakshi

ముంబై: మౌలిక సదుపాయాల దిగ్గజం లార్సెన్‌ అండ్‌ టుబ్రో(ఎల్‌అండ్‌టీ) వాటాదారులకు ప్రత్యేక డివిడెండ్‌ను ప్రకటించనుంది. బుధవారం(28న) సమావేశంకానున్న కంపెనీ బోర్డు ఈ అంశంపై నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. 28న నిర్వహించనున్న సమావేశంలో బోర్డు ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసిక(జులై- సెప్టెంబర్‌) ఫలితాలను సైతం విడుదల చేయనున్నట్లు తెలియజేసింది. బుధవారం బోర్డు ప్రకటించనున్న ప్రత్యేక డివిడెండ్‌కు నవంబర్‌ 5 రికార్డ్‌ డేట్‌గా నిర్ణయించినట్లు తాజాగా తెలియజేసింది. ఇంతక్రితం 2008 మార్చిలో ఎల్‌అండ్‌టీ ప్రత్యేక డివిడెండ్‌ను చెల్లించింది. ఎలక్ట్రికల్‌, ఆటోమేషన్‌ బిజినెస్‌ను ష్నీడర్‌ ఎలక్ట్రిక్‌కు ఆగస్ట్‌లో విక్రయించింది. ఈ విక్రయం పూర్తికావడంతో ప్రత్యేక డివిడెండ్‌ యోచన చేపట్టి ఉండవచ్చని ఈ సందర్భంగా మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement